31 C
India
Monday, April 29, 2024
More

    Big Boss Sivaji : నేను ఎవరికీ భయపడ.. బాబుగారి దగ్గర అందుకే తగ్గా.. శివాజీ ఓపెన్

    Date:

    Big Boss Sivaji
    Big Boss Sivaji

    Big Boss Sivaji : మాస్టర్ సినిమాతో సినిమాల్లోకి వచ్చిన గుంటూరు బిడ్డ శివాజీ. చిన్న స్థాయి నుంచి వచ్చి ఏ గాడ్ ఫాదర్ లేకుండా హీరో సైడ్ క్యారెక్టర్లు వేసి హీరోగా మారారు. సినీ నటుడిగా శివాజీది క్లీన్ ఇమేజ్. కానీ ఎప్పుడైతే పొలిటికల్ టర్న్ తీసుకున్నాడో అప్పటి నుంచి అతడి మాటలు, చేష్టల ద్వారా వివాదస్పదుడిగా మారారు. మొదట్లో బీజేపీ, ఆ తర్వాత టీడీపీకి ఫుల్ సపోర్టివ్ గా నిలిచారు.  2019 ఎన్నికల్లో టీడీపీకి వీర సైనికుడిగా పనిచేశారు.  ‘‘ఆపరేషన్ గరుడ’’ పేరిట హల్ చల్ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో టీడీపీ పరాజయం చెందడంతో ఇక సైలంట్ అయిపోయారు. ఎవరూ ఊహించని విధంగా బిగ్ బాస్ సీజన్ 7లోకి ఎంట్రీకి ఇచ్చారు. ఆయన షోలోకి అడుగుపెట్టినప్పుడు చాలా నెగిటివిటీ ఉండేది.. ఆయన బయటకు వచ్చేసరికి కాస్త తగ్గిపోయిందనే చెప్పాలి. శివాజీ తన ప్రవర్తనతో కొందరికీ హీరోగా.. మరికొందరికి విలన్ గా కనిపించింది వాస్తవం.

    ‘‘బాబు గారూ.. నేను మాట తప్పాను.. ఇక ఈ వారం బాగుంటానండీ’’ అంటూ పదే పదే చెప్పడం.. మళ్లీ మాటలు తూలడం.. అమర్ దీప్ బ్యాచ్ ను చిన్న చూపు చూడడం, పెద్దరికం పేరుతో తనకు ఇష్టమైన ప్రశాంత్, యావర్ లను ప్రోత్సహించడం వంటివి శివాజీకి ప్లస్, మైనస్ లుగా నిలిచాయనే చెప్పాలి. అయితే యావర్ 15లక్షలు గెలుచుకున్నా.. ప్రశాంత్ విన్నర్ అయినా వారి వెనక శివాజీ మైండ్ గేమ్ ఉందనే చెప్పాలి. శివాజీ సపోర్ట్ వారికి బాగా మైలేజీ ఇచ్చింది. బిగ్ బాస్ షో అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన శివాజీ తన బిగ్ బాస్ జర్నీపై ఓ వీడియో చేసి అందరికీ ధన్యవాదాలు తెలిపారు.

    కామన్ మ్యాన్ గెలవాలనుకున్నా..
    స్టార్ మా వాళ్లు.. శివాజీని అక్కడ పెట్టారు.. ఇక్కడ పెట్టారు అన్న కామెంట్స్ అవసరం లేదు.. వాళ్లంతా ఓ పద్ధతి ప్రకారం ఓటింగ్ పెట్టారు. అందులో విజేతగా నా బిడ్డ పల్లవి ప్రశాంత్ గెలిచాడు. వాడు గెలవాలని నేను కోరుకున్నాను. ప్రజలు ప్రభుత్వాల చేతిలో ఓడిపోతుంటారు. కామన్ మ్యాన్ గెలవడానికి ఎక్కడా అవకాశం ఇవ్వరు. అందుకే ఈ సీజన్ లోనైనా కామన్ మ్యాన్ గెలవాలని అనుకున్నాను. ప్రశాంత్ లాంటి రైతుబిడ్డ, యావర్ లాంటి సామాన్యులు ఈ షోకు రావడమే గొప్ప. వారికి మంచి అవకాశం వచ్చింది. అందుకే వారికి సపోర్ట్ చేశా. ప్రశాంత్ విజేతగా నిలిచాడు. యావర్ రూ.15లక్షలు సంపాదించాడు.

    బాబు గారంటే గౌరవం..
    ఈ షోలో నాకు మొదట అవకాశం ఇచ్చిన నాగార్జున బాబు గారితో మాట్లాడడం సంతోషాన్నిచ్చింది. ఆయన ప్రతీ వారం మాస్టర్ లా బోధించడం నాకు చాలా బాగా అనిపించేది. నేను ఎక్కడా భయపడే వ్యక్తిని కాదు.. కానీ బాబుగారి దగ్గరకు వచ్చేసరికి ఒకటికి వందసార్లు ఆలోచించి మాట్లాడేవాడిని. ఎందుకంటే ఆయనకు గౌరవం ఇవ్వకుంటే నేను మనిషేనే కాను. నాకు ఆయన ఎన్నో విలువైన సూచనలు ఇచ్చారు. ఈ షో సక్సెస్ లో ఆయనది కీలకపాత్ర. ఆయనకు రుణపడి ఉంటా..

    అంటూ తన వీడియోను ఆయన ముగించారు. ఇప్పుడే ఇంటికి వచ్చానని, త్వరలోనే అందరినీ కలుస్తా అని చెప్పారు.

    Share post:

    More like this
    Related

    Samantha : నిర్మాతగా రూత్ ప్రభు: ఫ్యాన్స్ కు బర్త్ డే గిఫ్ట్ ఇచ్చిన సామ్..

    Samantha : సమంత రూత్ ప్రభు బర్త్ డే సందర్భంగా అభిమానులకు...

    RCB Vs GT : గుజరాత్ పై ఆర్సీబీ గ్రాండ్ విక్టరీ

    RCB Vs GT : గుజరాత్ టైటాన్స్ పై ఆర్సీబీ గ్రాండ్...

    Cyber Scam : సీబీఐ అధికారులం అంటూ.. రూ.50 లక్షలు కొట్టేశారు

    Cyber Scam : సైబర్ నేరాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఒక్కొక్కరు ఒక్కో...

    Faria Abdullah : ‘ఆ ఒక్కటి అడక్కు’ మంచి ఎంటర్‌టైన్ మూవీ: ఫరియా అబ్దుల్లా

    Faria Abdullah : అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Nagarjuna-Amala : అమలకు, నాగార్జునకు మధ్య గొడవ.. ఎందుకు ఆ నెల రోజులు మాట్లాడుకోలేదు

    Nagarjuna-Amala : అక్కినేని నాగార్జున, అమల దంపతులకు సినీ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన...

    Allari Naresh : రజినీకాంత్ కోడలితో అల్లరి నరేష్ రొమాన్స్..జనాలు చూస్తే ఏమైపోతారో!

    Allari Naresh : ఈ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

    MM Keeravani : ఫ్రెండ్ షిప్ కు కీరవాణి మ్యాజికల్ టచ్.. సాంగ్ అదుర్స్..

    MM Keeravani : చాలా కాలం తర్వాత కింగ్ నాగార్జున వెండితెరపై...

    Prince Yawar : యావర్‌తొ రొమాన్స్ చేసిన అమ్మాయి ఎవరో తెలుసా! వీడియో వైరల్

    Prince Yawar : దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే తెలుగు రాష్ట్రాల్లో...