33.2 C
India
Sunday, May 19, 2024
More

    Jailer Box Office Collections : చరిత్ర సృష్టించిన రజనీ ‘జైలర్’.. ఫైనల్ గా ఎంత రాబట్టిదంటే?

    Date:

    Jailer Box Office Collections :

    సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ఉన్నాయి. శివాజీ.. రోబో వంటి సినిమాలు అప్పట్లో ఆల్ టైమ్ హైయెస్ట్ గ్రాస్ ను రాబట్టాయి. అయితే ఆ స్థాయిలో రజనీకి చెప్పుకోదగిన సినిమా పడలేదనే చెప్పొచ్చు. దర్బార్.. కబాలి వంటి సినిమాలు వచ్చినా పెద్దగా కలెక్షన్లు రాబట్టలేదు. అయితే డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్-రజనీకాంత్ కాంబోలో వచ్చిన ‘జైలర్’ మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

    ‘జైలర్’ మూవీ బాక్సాఫీస్ వద్ద రజనీ స్టామినా ఏంటో మరోసారి నిరూపించింది. తొలి షో నుంచే ‘జైలర్’కు సూపర్ హిట్ టాక్ రావడంతో కలెక్షన్లు ఓ రేంజులో వచ్చాయి. ఆగస్టు 10న మొదలైన ‘జైలర్’ ప్రభంజనం గత 26 రోజులు కొనసాగుతూనే ఉంది. ప్రాంతీయ చిత్రంగా విడుదలైన ‘జైలర్’ మూవీ ప్యాన్ ఇండియా రేంజులో కలెక్షన్లు రాబట్టడంపై నిర్మాతలు ఖుషీ అవుతున్నారు.

    జైలర్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తొలివారం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.236 కోట్లను రాబట్టింది. తమిళంలో రూ.185 కోట్లు.. తెలుగులో రూ.. 47 కోట్లు.. కర్ణాటకలో రూ.2 కోట్లు.. హిందీలో రూ. 2 కోట్లను రాబట్టింది. రెండో వారంలో 63 కోట్లు వచ్చాయి. తమిళంలో రూ. 46కోట్లు.. తెలుగులో రూ. 13 కోట్లు.. కర్ణాటకలో ఒక కోటికి పైగా.. హిందీలో రూ. 2.5 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి.

    మూడో వారంలో ‘జైలర్’ రూ. 30 కోట్లను వసూలు చేసింది. తమిళంలో రూ. 22 కోట్లు.. తెలుగులో రూ. 5.5 కోట్లు.. కర్ణాటకలో రూ.75 లక్షలు.. హిందీలో రూ. 1.5 కోట్లు వచ్చాయి. మొత్తంగా గత 27 రోజుల్లో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా 395 కోట్లను రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఈ మూవీ మొత్తంగా 602 కోట్ల వసూళ్లను నమోదు చేసినట్లు తెలుస్తోంది.

    240 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌లో బాక్సాఫీస్ జర్నీని ప్రారంభించిన ‘జైలర్’ ఇప్పటి వరకు ఇండియాలో 395 కోట్లకు పైగా రాబట్టింది. ఓవర్సీస్‌లో 200 కోట్లకుపైగా వసూళ్లతో ‘జైలర్’ 600 కోట్ల క్లబ్‌లో సునాయసంగా చేరింది. తొలివారమే బ్రేక్ ఈవెన్‌ను సాధించి లాభాల్లోకి చేరిన జైలర్ ఇప్పటీకే 200 కోట్లకు పైగా సాధించింది. రాబోయే రోజుల్లో ఈ సినిమా మరింతగా లాభాలను వచ్చే అవకాశముంది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి 24 గంటల సమయం

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం...

    Kanguva : 10 వేల మందితో ‘కంగువా’ షూట్.. సూర్య-బాబీ డియోల్ క్లైమాక్స్ వార్ మూవీకే హైలట్..

    Kanguva : హీరో సూర్య నటించిన ‘కంగువా’ చిత్రం విడుదలకు సిద్ధం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Devara : జైలర్ హుకుమ్ కాదు.. దేవర అంతకు మించి.. ఫ్యాన్స్ కు పండగే

    Devara : మ్యాన్ అఫ్ మాసెస్ ఎన్టీఆర్ అభిమానులు ఎంతగానో ఎదురు...

    Director Nelson : అల్లు అర్జున్ ను కలిసిన డైరెక్టర్ నెల్సన్.. కథ వినిపించేందుకు అంటూ టాక్

    Director Nelson : ‘పుష్ప’ సినిమాతో జాతీయ అవార్డు అందుకున్న అల్లు అర్జున్...

    Jailer Record At Malaysia : మలేషియాలో ‘జైలర్’ మరో రికార్డ్.. సాధించిన ఏకైక హీరో సూపర్ స్టారే!

    Jailer Record At Malaysia : సౌత్ ఇండియన్ ఇండియన్ హీరోల్లోనే...

    Cinema News : ‘జైలు’ సెంటిమెంట్ ఉంటే బ్లాక్ బస్టరేనా..!

    Cinema News : సినిమాలో జైలు సెంటిమెంట్ ఉంటే అది బ్లాక్...