39 C
India
Sunday, May 19, 2024
More

    Elon Musk : రీ యూజ్ రాకెట్లు అయితే మరింత మేలు.. ఎలన్ మస్క్

    Date:

    Elon Musk
    Elon Musk

    Elon Musk : అంతరిక్షంలోకి వ్యోమగాములు, సందర్శకులను పంపేందుకు రీ యూజ్ రాకెట్లు (పునర్వినియోగ రాకెట్లు), స్పేస్ షిప్స్ రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ప్రపంచానికి మరో క్యాప్సూల్ అవసరం లేదని స్పేస్ X అధినేత ఎలన్ మస్క్ అన్నారు. తన ప్రత్యర్థి బోయింగ్ సంస్థకు చెందిన స్టార్ లైన్ తన మిషన్ ను నిలిపివేసుకోవడంతో ఈ విషయాన్ని ఆయన తన ఎక్స్ (ట్విటర్) ఖాతా నుంచి పోస్ట్ చేశారు.

    నాసా వ్యోమగామి బుచ్ విల్మోర్, భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియన్స్ ను అంతరిక్షంలోకి పంపాలని స్టార్ లైనర్ రూపొందించిన మానవ సహిత మిషన్ ను బోయింగ్ సంస్థ శుక్రవారం రద్దు చేసింది. అయితే ఈ ప్రయోగానికి 2 గంటల ముందు కాకెట్ పైభాగంగాలో వాల్వ్ సమస్య తలెత్తడంతో ప్రయోగం రద్దు చేసుకోవాల్సి వచ్చింది.

    అంతరిక్షంలోకి రాకెట్లను పంపేందుకు బోయింగ్ సంస్థ స్టార్ లైనర్ తో పాటు స్పేస్ X  2014లో నాసా కమర్షియల్ క్రూ ప్రోగ్రామ్ తో ఒప్పందం చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో 2020 నుంచి స్పేస్ X తన ఫాల్కన్ 9 ద్వారా డ్రాగన్ క్యాప్సూల్స్ లో వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపిస్తుండగా.. బోయింగ్ ఈ విషయంలో ఇంకా వెనుకనే ఉండిపోయింది.

    వ్యోమగామి క్యాప్సూల్ ను తయారు చేసేందుకు బోయింగ్ సంస్థకు 4.2 బిలియన్ డాలర్లు, స్పేస్ Xకు 2.6 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. కానీ స్పేస్ X మాత్రం 4 సంవత్సరాల ముందుగానే రూపొందించి రికార్డ్ సృష్టించింది. మానవ సహిత క్యాప్సూల్ డ్రాగన్ 1, 2 డిజైన్ల మధ్య వ్యత్యాసాన్ని మస్క్ గుర్తించారు. బోయింగ్ లో చాలా మంది నాన్ టెక్నికల్ మేనేజర్లు ఉన్నారని మస్క్ చెప్పారు.

    ఇది ఇలా ఉండగా.. ప్రపంచంలోనే అతిపెద్ద ఏరోస్పేస్ కంపెనీ అయిన బోయింగ్ తన విజిల్ బ్లోయర్ల అనుమానాస్పద మరణాలపై వరుస వివాదాలను ఎదుర్కొంటోంది. ‘ఇన్ని విజిల్స్ పేలుతుండగా వారు ఏదైనా పనిని ఎలా చేస్తారు!?’ అని మస్క్ ఒక వినియోగదారుడికి సమాధానంగా చెప్పారు. ‘బోయింగ్ విజిల్ తయారీదారుకు రీబ్రాండ్ చేయాలి’ అని మస్క్ అన్నారు.

    బోయింగ్ తన స్టార్ లైనర్, స్పేస్ X డ్రాగన్ రెండూ నాసా మిషన్ల కోసం వ్యోమగాములను, సరుకును తక్కువ భూ కక్ష్య, మరియు అంతకు మించి తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి.

    Share post:

    More like this
    Related

    Cognizant : ఆఫీసుకు రాకుంటే జాబ్ నుంచి తీసేస్తాం: కాగ్నిజెంట్

    Cognizant : ఉద్యోగులంతా కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని, ఈ నిబంధనను...

    Arvind Kejriwal : ఆప్ అంతానికి బీజేపీ ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్

    Arvind Kejriwal : ఆప్ నేతలను అరెస్టు చేసి జైళ్లకు పంపించేందుకు...

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Elon Musk : ఎలన్ మస్క్ ఇండియా పర్యటన వాయిదా, ఏపీకి మేలు చేస్తుందా?

    Elon Musk : టెస్లా అధినేత ఎలన్ మస్క్ ఈ నెల...

    America : నిఘా ఉపగ్రహాల నెట్ వర్క్ ను నిర్మిస్తున్న అమెరికా..!

    America : ప్రపంచాన్ని తమ నిఘా నీడలో తెచ్చే ప్రయత్నాలను అమెరికా...

    Elon Musk Neuralink : మనిషి మెదడులో న్యూరాలింక్ చిప్.. ఎలాన్ మస్క్ ప్రయోగాలు ఎటు దారి తీస్తాయో?

    Elon Musk Neuralink : మనిషి తన మెదడుతో ఎన్నో ఆవిష్కరణలు...

    Elon Musk : ఎలన్ మస్క్ ముక్కుపిండీ మరీ మిలియన్ డాలర్లు వసూలు

    Elon Musk : టెస్లా కార్ల కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ గురించి...