33.6 C
India
Monday, May 20, 2024
More

    Gaddar : గద్దర్ మరణానికి కారణమిదే..

    Date:

    Gaddar
    Gaddar

    Gaddar : ప్రజానాయకుడు గద్దర్ కన్నుమూశారు. తెలంగాణ ఉద్యమంలో ముఖ్య భూమిక పోషించిన ఆయన గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుది శ్వాస విడిచారు. ఆయన మరణ వార్త విని తెలంగాణ ఉలిక్కిపడింది. ఒక ఉద్యమ నాయకుడిని కోల్పోయింది. తెలంగాణ ప్రజల కోసం అహర్నిశలు శ్రమించిన నేతగా ఆయనకు గుర్తింపు ఉంది.

    గద్దర్ మరణానికి కారణాలేంటని ఆలోచిస్తే ఆయనకు గుండె జబ్బు ఉందని తెలుస్తోంది. జులై 20న అపోలో ఆస్పత్రిలో గుండె నొప్పి రావడంత చేరారు. ఆగస్టు 3న గుండె ఆపరేషన్ చేయించుకున్నారు. శస్త్రచికిత్స అనంతరం ఆయనను ఇంటికి పంపించారు. కోలుకుంటున్న సమయంలో ఊపిరితిత్తులు, మూత్ర సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు.

    దీంతో పరిస్థితి విషమించి ఆస్పత్రిలో చేరినా పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు. ప్రజాయుద్ధ నౌకగా పేరు తెచ్చుకున్న గద్దర్ తన పాటలతో ప్రజల్లో చైతన్యం కలిగించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆయన గళం చాలా పాపులర్ అయింది. ఆయన గళం విప్పితే ప్రజలు మంత్రముగ్దులు కావాల్సిందే. అలా గద్దర్ ప్రస్థానంలో ఎన్నో మైలు రాళ్లు ఉన్నాయి. నిరంతరం ప్రజాభ్యుదయమే ధ్యేయంగా ముందుకు వెళ్లారు.

    ఆదివారం ఉదయం బీపీ పెరగడంతో పాటు షుగర్ లెవల్స్ ఒక్కసారిగా పడిపోయాయి. వైద్యులు చికిత్స అందించినా ఆరోగ్యం కోలుకోకపోవడంతో మధ్యాహ్నం 3 గంటల సమయంలో తుది శ్వాస విడిచారు. ఆయన శరీర అవయవాలు మొత్తం దెబ్బతిన్నాయని వైద్యులు తెలిపారు. గద్దర్ మరణంతో ఆయన కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు.

    Share post:

    More like this
    Related

    Cognizant : ఆఫీసుకు రాకుంటే జాబ్ నుంచి తీసేస్తాం: కాగ్నిజెంట్

    Cognizant : ఉద్యోగులంతా కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని, ఈ నిబంధనను...

    Arvind Kejriwal : ఆప్ అంతానికి బీజేపీ ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్

    Arvind Kejriwal : ఆప్ నేతలను అరెస్టు చేసి జైళ్లకు పంపించేందుకు...

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    CM KCR : రెండు చోట్ల కేసీఆర్‌ పోటీ వ్యూహాత్మకమా? రక్షణాత్మకమా? కామారెడ్డి బిడ్డ కోసమేనా!

    CM KCR : మరో రెండు నెలల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో...

    Telngana : తెలంగాణలో ఎన్నికల ప్రచారం.. పవన్, బన్నీ వేర్వేరు పార్టీలకు క్యాంపెయినింగ్..

    Telngana : తెలంగాణలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఏపీలోనూ ఇదే పరిస్థితి నెలకొంది....

    KCR : తెలంగాణ ఖజానాకు కాసుల వర్షం.. కేసీఆర్ స్కెచ్ మాములుగా లేదు..

    KCR :  తెలంగాణలో ఎన్నికలకు ముందు సీఎం కేసీఆర్ పలు సంక్షేమ...

    KCR-Governar : ఇద్దరూ వెనక్కి తగ్గడం లేదు.. మళ్లీ గవర్నర్ నుంచి అడ్డంకులు ?

    KCR-Governar : తెలంగాణ గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ కు ఇప్పట్లో...