Sandeep Vanga : అర్జున్ రెడ్డి తర్వాత అంతకంటే డబుల్ ధమాకా ‘యానిమల్’తో సాధించాడు డైరెక్టర్ సందీప్ వంగ. రణబీర్ కపూర్, రష్మిక మందన్న జంటగా నటించిన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రూ. 800 కోట్ల క్లబ్ ను టచ్ చేసింది. సందీప్ తన తర్వాతి మూవీ రెబల్ స్టార్ తో చేయనున్నట్లు తెలిసిందే. దీని గురించి అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ కూడా వచ్చింది. ఈ సినిమాకు ‘స్పిరిట్’ అని పేరు కూడా పెట్టారట.
అర్జున్ రెడ్డి తర్వాత ఇదే మూవీని రీమేక్ చేసి బాలీవుడ్ లో కబీర్ సింగ్ గా ఇచ్చాడు. అర్జున్ రెడ్డి కన్నా కబీర్ సింగ్ ఎక్కువ కలెక్షన్లను రాబట్టింది. ఈ రెండు మూవీస్ తర్వాత యానిమల్ చేశాడు. ఇది కూడా పాన్ ఇండియా రేంజ్ లో బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను రాబట్టింది. ప్రభాస్ సినిమా తర్వాత అల్లు అర్జున్ తో మరో సినిమా చేయబోతున్నట్లు ప్రకటించాడు వంగ. వీరితోనే కాకుండా తన ఫెవరేట్ హీరోతో సినిమా చేయాలని మనసులోని మాట బయటపెట్టాడు. ఇంతకీ ఆయన ఎవరంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.
యానిమల్ తో ఫిల్మ్ ఫెటిర్నిటీలో హాట్ టాపిక్ అయ్యాడు సందీప్ రెడ్డి వంగ. అలాంటి ఈ క్రేజీ స్టార్ డైరెక్టర్.. తన ఫెవరెట్ హీరో రామ్ చరణ్ తో సినిమా చేయలాని అనుకుంటున్నాడట. మహబూబా బాద్ జిల్లా, దంతాలపల్లికి వెళ్లిన ఆయన అక్కడ తన నియర్ అండ్ డియర్స్‌తో ఈ విషయం చెప్పాడట. బాస్ మెగాస్టార్ చిరంజీవితో మాత్రమే కాదు.. లిటిల్ బాస్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో సినిమా తీసేందుకు వెయిట్ చేస్తున్నా అంటూ.. ఓపెన్ అయ్యాడట. ప్రస్తుతం ఈ మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.