OTT Movies : సినిమాలు ఇప్పుడు ఓటీటీలో తన ప్రభావం చూపిస్తున్నాయి. పెద్ద సినిమాలను కాదని చిన్న సినిమాలు సంచలనం కలిగిస్తున్నాయి. ఇందులో హనుమాన్, యానిమల్ వంటి సినిమాలు ఉన్నాయి. కోట్ల కొద్దీ వ్యూస్ దక్కించుకుంటున్నాయి. ప్రస్తుతం ఓ మూడు సినిమాలు ఓటీటీని షేక్ చేస్తున్నాయి. టాప్ 3లో నిలిచిన ఆ సినిమాలేంటో తెలుసుకుందాం.
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన సినిమా యానిమల్. రణవీర్ కపూర్, రష్మిక మందన్నా ప్రధాన పాత్రధారులుగా నటించారు. టి సిరీస్ ఫిల్మ్స్, భద్రకాళి పిక్చర్స్, సినీ వన్ స్టూడియోస్ పై భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, మురాద్ ఖేతాని, ప్రణయ్ రెడ్డి వంగా సంయుక్తంగా నిర్మించారు. పక్కా యాక్షన్ ప్రధానాంశంగా సినిమా నిర్మాణం జరిగింది. బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
రణబీర్ కపూర్ నటనకు ప్రేక్షకులు జేజేలు పలుకుతున్నారు. నెట్ ఫ్లిక్స్ వేదికగా ఓటీటీలోకి వచ్చింది. సుమారు రూ.900 కోట్లు రాబట్టుకుంది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో బ్రహ్మాండమైన హిట్ గా నిలుస్తోంది. సామ్ బహదూర్ అనే సినిమా ప్రస్తుతం జీ5 వేదికగా భారత ఆర్మీ తొలి ఫీల్డ్ మార్షల్ సామ్ మానెక్ షా జీవితం ఆధారంగా ఆర్ఎన్ వీపీ మూవీస్ బ్యానర్ పై రోనీ స్క్రూవాలా నిర్మించిన ఈ సినిమాకు మేఘనా గుల్జార్ దర్శకత్వం వహించారు.
ఐఏఎస్ అధికారి మనోజ్ కుమార్ శర్మ, ఐఆర్ఎస్ అధికారి శ్రద్ధ జోషిల జీవితాల ఆధారంగా ప్రేరణ పొంది రాసిన 12th ఫెయిల్ నవల ఆధారంగా వినోద్ చోప్రా ఫిల్మ్స్ బ్యానర్ పై విధు వినోద్ చోప్రా, యోగేష్ ఈశ్వర్ నిర్మించిన ఈ చిత్రాన్ని అక్టోబర్ 27న విడుదల చేశారు. మేధా శంకర్, ప్రియాంశూ చటర్జీ, సంజయ్ బిష్ణోయ్, హరీష్ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటించారు. డిసెంబర్ 29న హిందీ, తమిళ, కన్నడ భాషల్లో వచ్చింది. ఈ సినిమాలకు ఓటీటీలో మంచి స్పందన వస్తోంది.