37 C
India
Friday, May 17, 2024
More

    ఆరేళ్లకే ఆకట్టుకున్న సారా అర్జున్.. ఇంతకీ ఎవరీ చిన్నారి..

    Date:

    PS2-sara-arjun
    PS2-sara-arjun

    మణిరత్నం కలల ప్రాజెక్టు ‘పొన్నియిన్ సెల్వన్’లో నందిని క్యారెక్టర్ లో నటించి ఆకట్టుకున్న చిన్నారి గుర్తింది కదూ.. ఐశ్వర్య రాయ్ చిన్ననాటి పాత్రలో ఆ చిన్నారి ఐశ్వర్య కంటే కూడా అందాలను వలకబోసింది. ఆ చిన్ననాటి నటి ఎవరో కాదు. సారా అర్జున్. ఇందులో ఆమె నటన పొన్నియన్ సెల్వన్ కు హైలెట్ అనే చెప్పాలి. ఆ చిన్నారి ఎవరు..? ఎక్కడి నుంచి వచ్చింది..? ఎవరి కూతురు..? అంటూ నెటిజన్ల తెగవెతుకుతున్నారు. ఆమె గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.

    రాజ్ అర్జున్ కూతురే సారా..

    బాలీవుడ్ లో అగ్రనటుడిగా గుర్తింపు సంపాదించుకున్న రాజ్ అర్జున్ కూతురే సారా అర్జున్. ఎన్నో చిత్రాల్లో ఆయన విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించారు. టాలీవుడ్ లో ‘డియర్ కామ్రేడ్’లో రాజ్ అర్జున్ విలన్ పాత్ర పోషించి తెలుగువారిని ఆకట్టుకున్నాడు. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండతో నటించగా, తన తమ్ముడు ఆనంద్ దేవరకొండతో ‘గంగం గణేశా’లో కీరోల్ లో నటిస్తున్నారు రాజ్ అర్జున్.

    రాజ్ అర్జున్ కుమార్తె సారా అర్జున్ ఏడాదిన్నర వయస్సు నుంచే నటించడం మొదలు పెట్టింది. రాజ్ అర్జున్ ఒక సారి కుటుంబంతో ఒక షాపింగ్ మాల్ కు వెళ్లగా.. అక్కడికి వచ్చిన ఓ యాడ్ యాజమాన్యం. సారాను చూసి ముచ్చటపడ్డారు. చిన్నారితో ఎలాగైనా యాడ్ చేయాలి అనుకున్నారు. దీనికి తన తండ్రి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సారా యాడ్ లో కనిపించింది. ఈ యాడ్ క్లిక్ కావడంతో భారీ కంపెనీలకు వరుసగా యాడ్ షూట్లు చేసింది సారా. ఇప్పటికీ ఆమె 50కి పైగా యాడ్స్ చేసిందట. అందులో ప్రముఖ కంపెనీలు మ్యాగీ, కల్యాణ్ జువెల్లర్స్, మెక్ డోనాల్డ్, క్లినిక్ ప్లస్ తదితరాలు ఉన్నాయి.

    దర్శకుడు విజయ్ సారా రెండేళ్ల వయస్సులో ఓ యాడ్ తీశాడు. ఆమె క్యూట్ నెస్ కు ముగ్దుడై తర్వాత ఆయన సినిమా ‘దైవ తిరుమగల్’లో సారాకు అవకాశం ఇచ్చాడు. ఈ చిత్రం ఆమె మొదటి సినిమా కాగా అప్పుడు ఆమె వయస్సు ఆరేళ్లు. తరువాత చియాన్ విక్రమ్ తో కలిసి ‘దైవ తిరుమగల్’లో కుమార్తెగా నటించింది సారా. అదే చిత్రాన్ని ‘నాన్న’ పేరుతో తెలుగులో రీమేక్ చేశారు. 2011లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు హైలట్ కోర్ట్ రూం సీన్. దీనికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. నాన్న సక్సెస్ ఆమెను అగ్రస్థానంలో నిలిపింది. తర్వాత ఆమెకు అనేక ప్రాజెక్టులు వచ్చాయి. ఇప్పటి వరకూ 15 సినిమాలకు పైగా ఆమె నటించింది. ‘దాగుడుమూతలు దండాకోర్’ సినిమాలో ఆమె కీలక పాత్ర పోషించింది.

    మణిరత్నం కలల ప్రాజెక్టు పొన్నియిన్ సెల్వన్ లో సారా అర్జున్ నటన విపరీతంగా ఆకట్టుకుంది. యవ్వనంలో ఆదిత్య కరికాలుడి ప్రేయసిగా నటించిన సారా.. కృష్ణుడి భక్తురాలిగా, సామాన్య యువతిగా నటించి మెప్పించింది. ఈ సినిమాలో ఆమెకు ఒక పాటను కూడా ఇచ్చారు మణిరత్నం. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది సారా. తన ఫ్యామిలీ పిక్స్ తో పాటు తన పిక్స్, షూటింగ్ విశేషాలను తన ఫాలోవర్స్ తో పంచుకుంటుంది ఆమె. కెరీర్ ప్రారంభంలోనే టాప్ డైరెక్టర్, టాప్ మూవీలో నటించడంపై ఆనందం వ్యక్తం చేస్తుంది సారా అర్జున్.

    Share post:

    More like this
    Related

    AP Attacks : కేంద్ర నిఘా వర్గాల హెచ్చరిక..ఆ పార్టీ ఓడిపోతుందనే ప్రచారంతోనే దాడులు..

    AP Attacks : ఏపీలో ఎన్నికలు పూర్తయ్యే వరకు సుద్దపూసల్లాగా నీతులు...

    Vijayashanthi-KCR : రాముల‌మ్మకు కేసీఆర్ గుర్తుకు వస్తున్నారా.. ఆ ట్వీట్ అర్థం ఏంటో?

    Vijayashanthi-KCR : బీఆర్ఎస్‌ పార్టీపై సినీ నటి, రాజకీయ నాయకురాలు  విజయశాంతి...

    Kidnap : కిడ్నాప్ చేసి.. 26 ఏళ్లు పొరుగింట్లోనే బంధించారు

    Kidnap : చంకలో బిడ్డనుంచుకొని ఊరంతా వెతికినట్లు పక్కింట్లో వ్యక్తిని పెట్టుకొని...

    Prabhas : కాబోయే భార్యను పరిచయం చేయబోతున్న ప్రభాస్.. ఇన్ స్టా పోస్టు వైరల్ 

    Prabhas : డార్లింగ్స్ ఫైనల్లీ సమ్ వన్ వెరీ స్పెషల్ పర్సన్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Sara Arjun: అత్యధిక పారితోషికం తీసుకునే చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరో తెలుసా?

    Sara Arjun: నటుడు రాజ్ అర్జున్ కూతురు సారా అర్జున్ అంటే...