33.5 C
India
Tuesday, May 14, 2024
More

    “Jawaan” Review & Rating : షారుఖ్ ”జవాన్” రివ్యూ అండ్ రేటింగ్..!

    Date:

    “Jawaan” Review & Rating :

    బాలీవుడ్ స్టార్ హీరోలలో షారుఖ్ ఖాన్ ఒకరు.. గత ఏడాది పఠాన్ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకుని మళ్ళీ ఫామ్ లోకి వచ్చి అదే ఊపులో మరో సినిమాను పూర్తి చేసి రిలీజ్ కూడా చేసాడు. షారుఖ్ ఖాన్ హీరోగా కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ ఏవైటెడ్ మూవీ ”జవాన్”.. ఈ సినిమా ఈ రోజు థియేటర్స్ లోకి వచ్చింది. మరి ఈ సినిమా రివ్యూ అండ్ రేటింగ్ చూద్దాం..

    నటీనటులు :

    షారుఖ్ ఖాన్
    నయనతార
    దీపికా పదుకొనె
    విజయ్ సేతుపతి
    ప్రియమణి తదితరులు..

    డైరెక్టర్ : అట్లీ కుమార్

    మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్

    నిర్మాత : గౌరీ ఖాన్

    కథ :

    ఆజాద్ (షారుఖ్ ఖాన్) ఒక జైలర్.. అదే జైల్లో ఉండే కొంత మంది అమ్మాయిలతో కలిసి ఆజాద్ అన్యాయం చేసే వారిపై తిరగబడుతూ ఉంటారు.. మెట్రో ట్రైన్ హైజాక్ చేయడం, హెల్త్ మినిష్టర్ ను కిడ్నప్ చేయడం వంటివి చేస్తూ ప్రభుత్వ పనితీరును ఆజాద్ వారికీ వేలెత్తి చూపిస్తుంటారు.  ఇక వీరిని పట్టుకోవడానికి నర్మద (నయనతార) స్పెషల్ పోలీస్ ఆఫీసర్ ట్రై చేస్తుంది.. ఇక ఇండియాను షేక్ చేస్తున్న బిజినెస్ మ్యాన్ గైక్వాడ్ (విజయ్ సేతుపతి) ఈ ఇద్దరి మధ్య ఉంటాడు. ఇక ఆజాద్ లైఫ్ లోకి విక్రమ్ రాధోర్ (షారుఖ్ ఖాన్) వస్తాడు.. మరి ఈయన ఎవరు? ఐశ్వర్య ( దీపికా) మధ్యలోకి ఎలా వచ్చింది? ఆజాద్ గా ప్రజలకు న్యాయం ఏ విధంగా చేసాడు? అసలు అతడు అలా మారడానికి కారణం ఏంటి? అనేది మిగిలిన కథ..

    విశ్లేషణ :

    పఠాన్ హిట్ తర్వాత జవాన్ వంటి సినిమాను ఎంచుకుని షారుఖ్ తన కెరీర్ లోనే మంచి స్టెప్ వేసాడు అనే చెప్పాలి. పఠాన్ సక్సెస్ ను కొనసాగించే సినిమాను ఎంచుకుని షారుఖ్ ఫ్యాన్స్ కు మంచి కిక్ ఇచ్చాడు అనే చెప్పాలి.. ఈ సినిమాలో యాక్షన్ మాత్రమే కాదు ఎలివేషన్స్, ఎమోషన్స్ చూపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.. అట్లీ డైరెక్షన్ షారుఖ్ ఖాన్ నటన చూసి ప్రేక్షకులు టేక్ ఏ బో అంటున్నారు.. రైతు సీన్, మెడికల్ స్కామ్ లో పిల్లల సీన్స్ కళ్ళల్లో నీళ్లు తెప్పించాయి.. మొత్తానికి ప్రేక్షకులకు గూస్ బంప్స్ అయితే తెప్పించేసాడు..

    నటీనటుల పర్ఫార్మెన్స్ :

    ఈ సినిమాలో 57 ఏళ్ల వయసులో కూడా షారుఖ్ ఖాన్ ఫిట్ నెస్ తో యాక్షన్ సీన్స్ లో అదరగొట్టాడు.. అలాగే ఆయన ఎనర్జీ లెవల్స్ కుర్ర హీరోలను కూడా ఫిదా చేస్తాయి.. స్క్రీన్ మీద అదరగొట్టాడు అనే చెప్పాలి.. ఇక నయన్ రోల్ నెక్స్ట్ లెవల్.. అమ్మడి బాలీవుడ్ డెబ్యూ అదిరిపోయింది.. దీపికా పదుకొనె రోల్ చిన్నదే అయినా ఇంపాక్ట్ బాగా కనిపించింది. ప్రియమణి కూడా తన రోల్ తో ఆకట్టుకుంది. అలాగే విలన్ గా విజయ్ సేతుపతి కూడా ఎప్పటిలానే ఆడియెన్స్ ను కట్టిపడేసాడు..

    టెక్నీకల్ పర్ఫార్మెన్స్ :

    టెక్నీకల్ టీమ్ కూడా ఈ సినిమాకు ప్లస్ గా నిలిచారు. ముఖ్యంగా అనిరుద్ మ్యూజిక్ గూస్ బంప్స్ తెచ్చేలానే ఉన్నాయి.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కట్టిపడేసింది.. సినిమాటోగ్రఫీ కూడా నెక్స్ట్ లెవల్లో ఉంది.. అట్లీ డైరెక్టర్ గా ప్రేక్షకుల చేత ఫుల్ మార్కులు వేయించుకున్నారు. రొటీన్ కథ అయినప్పటికీ జవాన్ సినిమాను తన టేకింగ్ అండ్ స్క్రీన్ ప్లే తో నెక్స్ట్ లెవల్ కు తీసుకు వెళ్ళాడు. నిర్మాణ విలువలు కూడా అదిరిపోయాయి.

    ప్లస్ పాయింట్స్ :

    షారుఖ్ ఖాన్, విజయ్ మధ్య వచ్చే సీన్స్
    యాక్షన్ సన్నివేశాలు
    కథలో ట్విస్ట్స్

    మైనస్ పాయింట్స్ :

    సెకండాఫ్ లో స్లో నెరేషన్
    రొటీన్ సన్నివేశాలు

    చివరిగా.. ఆడియెన్స్ నుండి ఎలాంటి మైనస్ పాయింట్స్ వెతికిన కనిపించలేనంత ఈ సినిమా ఆకట్టుకుంది. జవాన్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.. ఇది పక్కా మాస్ ఎంటర్టైనర్ అనే చెప్పాలి.. మరి ఇది 1000 కోట్లు రాబడుతుందో లేదో చూడాలి.

    రేటింగ్ : 2.75/5

    Share post:

    More like this
    Related

    NRI News : సూర్యపేట- ఖమ్మం హైవేపై మిస్ అయిన అమెరికా నుంచి వచ్చిన ప్రవాసుల బ్యాగులు

    NRI News : అమెరికా నుంచి వచ్చిన ప్రవాస భారతీయుల బ్యాగులు మిస్...

    Rashmika : సీ లింక్ బ్రిడ్జి ‘అటల్ సేతు’పై రష్మిక కామెంట్.. ఏమందంటే?

    Rashmika :జనవరిలో ప్రధాన మంత్రి మోదీ భారతదేశపు అతి పెద్ద సీ...

    Jagan : జగన్ సైలెంట్ మోడ్ లోకి ఎందుకు వెళ్లినట్లు..?

    Jagan Silence : ఆంధ్రప్రదేశ్ లో నిన్న (మే 13) పోలింగ్...

    Dhanush-Aishwarya : ధనుష్, ఐశ్వర్య మధ్య అంతరాలకు కారణం అదేనా?

    Dhanush-Aishwarya : జనవరి 17, 2022, నటుడు ధనుష్ 18 సంవత్సరాల...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Tollywood Heros : జవాన్ ను వదులుకున్న టాలీవుడ్ హీరోలెవరో తెలుసా?

    Tollywood Heros : ఓడలు బండ్లవుతాయి. బండ్లు ఓడలవుతాయి. లక్ కలిసి...

    ‘Jawaan’ BO Report : ‘జవాన్’ బాక్సాఫీస్ రిపోర్ట్.. కలెక్షన్ల మోత..!

    'Jawaan' BO Report : బాలీవుడ్ బాద్షా షారుఖ్ నటించిన ‘జవాన్’ బాక్సాఫీస్...

    ‘Jawaan’ Advance Bookings : ‘జవాన్’ సెన్సేషనల్.. అడ్వాన్స్ బుకింగ్స్ లో బాహుబలి-2, గదర్-2 రికార్డులు గల్లంతు..!

    'Jawaan' Advance Bookings : బాలీవుడ్ స్టార్ హీరోలలో షారుఖ్ ఖాన్ ఒకరు.....

    Allu Arjun : జవాన్ మూవీకి ‘ఐకాన్ స్టార్’కు ఉన్న లింకేంటి?

    Allu Arjun : బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్.. లేడీ సూపర్...