37.4 C
India
Tuesday, May 14, 2024
More

    SIIMA Awards 2023 : బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్న తారక్.. ఒకే సినిమాకు 5 అవార్డ్స్!

    Date:

    SIIMA Awards 2023
    SIIMA Awards 2023

    SIIMA Awards 2023 : సినీ ఇండస్ట్రీలో ఉన్న సెలెబ్రెటీలకు ప్రతీ ఏడాది సత్కరించేందుకు ఎన్నో ముఖ్యమైన అవార్డులు ఉన్నాయి.. వారి నటనకు, టేకింగ్ కు నటులు, టెక్నీషియన్స్ కు మాత్రమే కాదు బెస్ట్ సినిమాగా నిలిచినా సినిమాలకు కూడా ప్రతీ ఏడాది అవార్డులను ఇచ్చి వారిని ప్రోత్సహిస్తుంటారు.. మరి ముఖ్యమైన అవార్డుల్లో సౌత్ వారు ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డు సైమా ఒకటి..

    సౌత్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA) ఈ ఏడాది జరిగాయి.. ఈ అవార్డులను తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ ఇండస్ట్రీలకు ప్రధానం చేస్తారు.. ఇప్పటికే 10 ఏళ్ళు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు 11వ ఏడాది కూడా ఘనంగా ముగిసింది. ఈ క్రమంలోనే ఎవరెవరు ఈ అవార్డులను అందుకున్నారో తెలుసుకుందాం..

    సెప్టెంబర్ 15న దుబాయ్ లో ఈ వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించారు. మరి మొదటి రోజు తెలుగు, కన్నడ సినిమాలకు మాత్రమే అవార్డులను అందించారు.. ఈసారి తెలుగులో ఆర్ఆర్ఆర్ సినిమా తన హవా చూపించింది. ఒకే సినిమాకు 5 అవార్డులను అందుకుంది.. ఉత్తమ నటుడుగా ఎన్టీఆర్ ఈ సినిమాకు గాను అవార్డు అందుకున్నారు.

    ఎన్టీఆర్ ఈ అవార్డును అందుకున్న వెంటనే తనదైన స్పీచ్ తో అక్కడి వారిని ఆకట్టుకున్నాడు. తన అవార్డుకు కారణం ఫ్యాన్స్ అని వారికీ పాదాభివందనం అంటూ చెప్పుకొచ్చాడు. అలాగే ఉత్తమ డైరెక్టర్ గా రాజమౌళి, ఉత్తమ సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి, ఉత్తమ గేయ రచయిత చంద్రబోస్, ఉత్తమ సినిమాటోగ్రాఫర్ గా సెంథిల్ కుమార్ అవార్డును ఈ సినిమాకు అందుకున్నారు.

    ఇక ఉత్తమ సినిమాగా సీతారామం, ఉత్తమ నటిగా శ్రీలీల ధమాకా సినిమాకు అవార్డు అందుకుంది. ఉత్తమ విలన్ సుహాస్ హిట్ 2, ఉత్తమ నటుడు (క్రిటిక్స్ ఛాయిస్) అడవి శేష్, ఉత్తమ నటి (క్రిటిక్స్ ఛాయిస్) మృణాల్ ఠాకూర్, ఉత్తమ సహాయ నటుడు రానా దగ్గుబాటి (భీమ్లా నాయక్), ఉత్తమ హాస్య నటుడు శ్రీనివాస్ రెడ్డి (కార్తికేయ 2), ఉత్తమ సహాయ నటి సంగీత (మసూద), ఉత్తమ గాయకుడూ రామ్ మిరియాల (డీజే టిల్లు), ఉత్తమ గాయని (మంగ్లీ), ఉత్తమ నూతన హీరో అశోక్ గల్లా (హీరో), ఉత్తమ నూతన నటి (మృణాల్), ఉత్తమ నూతన డైరెక్టర్ వసిష్ఠ (బింబిసార), ఉత్తమ నూతన నిర్మాత శరత్ అండ్ అనురాగ్ (మేజర్), ఫ్యాషన్ యూత్ ఐకాన్ శృతి హాసన్, ప్రామిసింగ్ స్టార్ బెల్లంకొండ గణేష్, సెన్సేషనల్ ఫిలిం ఆఫ్ ది ఇయర్ కార్తికేయ 2..

    Share post:

    More like this
    Related

    Modi Nomination : ‘గంగా’ ఆశీస్సులతో మోడీ నామినేషన్.. భారీ ర్యాలీ..

    Modi Nomination : ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి నియోజకవర్గంలో మంగళవారం (మే...

    Inaya Sulthana : ఒంటి మీద నూలుపోగు లేకుండా..సోషల్ మీడియాలో ‘ఇనాయా’ మేనియా..

    Inaya Sulthana : ఆర్జీవీ కాంపౌండ్ నుంచి వచ్చే హీరోయిన్లు యమ...

    Pawan Kalyan Victory : వర్మ త్యాగం ఫలించేనా.. పవన్ కల్యాణ్ విజయం ఖరారయినట్లేనా..!

    Pawan Kalyan Victory : పిఠాపురంలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన పవన్...

    Roja : రోజా ఈ వ్యాఖ్యల వెనుక అంత అర్థం ఉందా?

    Roja Comments Viral : ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    SIIMA Awards : సైమా వేదికపై వారిని తలుచుకొని కన్నీళ్లు పెట్టిన ఎన్టీఆర్

    SIIMA Awards : సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా)...