33.1 C
India
Wednesday, May 22, 2024
More

    చిన్న తనంలోనే ఇంత అందంగా ఉంది.. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ ను షేక్ చేసిన హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా..

    Date:

    Jaya pradha
    Jaya pradha young

    Jaya prada Young : అందం, అభినయం, క్యారెక్టర్ కు తగ్గట్లు తన స్వరూపాన్ని మార్చుకోవడం ఆమె సొత్తు. వందలాది చిత్రాలు చేసింది. కోట్లాది మందిని తన అభిమానులుగా మలుచుకుంది. ఇటు టాలీవుడ్ తో పాటు అటు బాలీవుడ్ లోనూ రాణించింది. ఇప్పుడు రాజకీయాల్లోనూ బిజీగా ఉంది. ఆమె ఎవరో తెలుసా.. మరింత తెలుసుకుందాం..

    టాలీవుట్ తో పాటు కోలీవుడ్ లో దాదాపు స్టార్ హీరోలతో పని చేశారు ఆమె. ఆమె చిత్రంలో ఉందంటే చాలు ఆమె చూసేందుకే అప్పటి యూత్ అయినా, ముసలి వాళ్లయినా థియేటర్ కు వచ్చేవారు. ఆ కాలంలో ఆమె అంత ఫేమ్ అయ్యేందుకు ప్రతీ ఒక్క తార కష్టపడి పని చేసేవారు. కొన్ని దశాబ్ధాలు ఇండస్ట్రీని ఏలారు ఆమె. ఆమె కన్నులు కలువలు. అందమైన చంద్రబింబం లాంటి మోము. ఇక ఆమె నటన గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అప్పట్లోనే సహజనటనతో కట్టిపడేసేది. ఎన్టీఆర్, కృష్ణ, ఏఎన్ఆర్, శోభవన్ బాబు, రజనీకాంత్ ఇలా చాలా మంది స్టార్ హీరోలతో ఆమె జోడీగా నటించింది. ఇప్పటికీ ఆమె సినిమాలు తీస్తూనే ఉంది. 14 సంవత్సరాల వయస్సులోనే మంచి గుర్తింపు దక్కించుకుంది.

    ఈ చిన్నారి ఎవరో కాదు అప్పటి వారికి కలల రాణి, అందాల తార, ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్న ‘జయప్రద’. అయితే జయప్రద 14 సంవత్సరాల వయస్సులోనే స్టేజీ షోలు చేసింది. ఆమె చేసిన నాట్యాన్ని చూసిన ఒక సినీ నటుడు ప్రభాకర్ రెడ్డి ఆమెను సినిమాల్లోకి తీసుకువచ్చారు. అయితే ఆమె అసలు పేరు ‘లిలితా రాణి’ సినిమాల్లోకి వచ్చిన తర్వాత జయప్రదగా (స్క్రీన్ నేమ్) మార్చుకున్నారు. 1976లో భూమికోసం సినిమాలో ఆమె మొదటి సారి కనిపించింది.

    ఇక అప్పటి నుంచి ఆమె నటనా ప్రస్థానం ఆగలేదు. 2005 వరకూ కొనసాగుతూనే ఉంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ, బెంగాళీ ఇలా అన్ని భాషల్లో దాదాపు 300కు పైచిలుకు చిత్రాలను తన ఖాతాలో వేసుకుంది జయప్రద. 22 జూన్, 1986న స్టార్ ప్రొడ్యూసర్ శ్రీకాంత్ నహతాను పెళ్లి చేసుకుంది Jaya Prada. ఎన్టీఆర్ ఆహ్వానంతో ఆమె టీడీపీలో 1994, అక్టోబర్ 10వ తేదీ చేరారు. రాజకీయ అరంగేట్రం చేసిన ఆమె ఆ రగంలోనూ రాణిస్తున్నారు. ఇప్పుడు ఆమె భారతీయ జనతా పార్టీ లో కొనసాగుతున్నారు.

    Share post:

    More like this
    Related

    Kiara Advani : ఫొటో గ్యాలరీ: ఆరంజ్ డ్రెస్ లో కియారా.. అందం చూడతరమా!

    Kiara Advani : ఫ్రెంచ్ రివేరాలో పండిపోయిన కియారా అద్వానీ కేన్స్‌లో...

    KKR Vs SRH : కోల్ కతా ఫైనల్ కు.. సన్ రైజర్స్ మరో చాన్స్ 

    KKR Vs SRH : కోల్ కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్...

    Singapore Airlines : విమానంలో భారీ కుదుపులు.. ఒకరి మృతి

    Singapore Airlines : సింగపూర్ ఎయిర్ లైన్స్ విమానానికి పెను ప్రమాదం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Jaya Prada : ముంబై హీరోయిన్లే పక్కలోకి వెళ్తారు.. కాస్టింగ్ కౌచ్ పై జయప్రద కామెంట్స్..!

    Jaya Prada : కాస్టింగ్ కౌచ్ మీద ఎవరి అభిప్రాయం వారు...

    40 ఏళ్ళ కృష్ణ – శోభన్ బాబు ముందడుగు

    సూపర్ స్టార్ కృష్ణ , నటభూషణ్ శోభన్ బాబు మల్టీస్టారర్ కాంబినేషన్...

    జయప్రద పై నాన్ బెయిలబుల్ వారెంట్

    సీనియర్ నటి , మాజీ ఎంపీ జయప్రద పై ఉత్తరప్రదేశ్ రాంపూర్...