41.1 C
India
Monday, May 20, 2024
More

    TDP : కుట్రలను ఎదురించి జెండా ఎగిరేసిన టీడీపీ.. ఏపీలో గెలుపుబావుటా

    Date:

    TDP
    TDP

    TDP : ఏపీలో కొన్ని పంచాయతీల సర్పంచులు, వార్డు సభ్యుల స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. అధికారాన్ని అడ్డు పెట్టుకొని వైసీపీ ఎంతకు తెగించినా, ఓటర్లను ప్రలోభ పెట్టని టీడీపీ గట్టి పోటీని ఇచ్చింది.  అయితే అన్ని చోట్ల టీడీపీ గట్టి పోటీని ఇచ్చింది. అధికార పార్టీకి చుక్కలు చూపించింది. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘోర వైఫల్యం చెందిన అధికార పార్టీ ఈసారి ఎలాగైనా గెలవాలని కుతంత్రాలు, విచ్చలవిడి డబ్బుల పంపిణీ, బెదిరింపులకు దిగింది. అయినా టీడీపీ తనదైన సత్తా చాటింది. మరోసారి అధికార వైసీపీకి వణుకు పుట్టించింది. త్వరలో రానున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ ఫలితాలు టీడీపీ శ్రేణుల్లో జోష్ ను మరింత రెట్టింపు చేశాయి. గత ఎన్నికల్లో వైసీపీ గెల్చుకున్న ఏడు పంచాయతీలను ఈసారి టీడీపీ దక్కించుకోవడం ఇక్కడ విశేషం.

    వైసీపీ మద్దతుదారులు 22 స్థానాలకే పరిమితమయ్యారు. అయితే గతంలో వైసీపీ గెలిచిన ఏడు పంచాయతీలను ఈ సారి టీడీపీ దక్కించుకోగా, మరొకటి టీడీప, జనసేన కలిసి దక్కించుకున్నాయి. మొత్తంగా 34 స్థానాల్లో 22 వైసీపీ, 9 టీడీపీ, 2 జనసేన, టీడీపీ కలిసి దక్కించుకున్నాయి. ఇక 243 వార్డులకు ఎన్నికలు జరగగా, వైకేపీ మద్దతుదారులు 141, టీడీపీ మద్దతుదారులు 90, జనసేన మద్దతుదారులు 5, ఇతరులు మిగతా చోట్ల గెలుపొందారు.  గత ఎన్నికల్లో వైసీపీ గెలిచిన బొప్పడం(శ్రీకాకుళం), శోభకోట(అల్లూరి సీతారామారాజు) కొరుప్రోలు(అనకాపల్లి), కావలిపురం(పశ్చిమగోదావరి), పాకాల(ప్రకాశం) లింగరాజు అగ్రహారం(శ్రీ పొట్టి శ్రీరాములు), జగంపల్లి(అనంతపురం) లను టీడీపీ గెలిపించుకుంది.

     అయితే మొత్తంగా 26 జిల్లాల్లో 64 సర్పంచ్, 1001 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ చోట్ల నామినేషన్లు వేయకుండా వైసీపీ అడ్డుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మరోసారి అక్రమాలను అధికార పార్టీ పునరావృతం చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. కొన్ని చోట్ల బలవంతంగా ఏకగ్రీవం చేసినట్లు తెలుస్తున్నది. మరికొన్ని చోట్ల టీడీపీ అభ్యర్థుల నామినేషన్లను అధికారులు చిన్న చిన్న సాకులు చూపించి తిరస్కరించినట్లు సమాచారం. అయితే ఎన్నికల ప్రక్రియలో వలంటీర్లు పాల్గొనవద్దని స్పష్టమైన ఆదేశాలు ఉన్నా, అధికార పార్టీ తరఫున బహిరంగ సభలు, కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అయితే ఈవిషయమై రాష్ర్టల ఎన్నికల సంఘానికి, కలెక్టర్లకు ఫిర్యాదులు అందినా ఎక్కడా వలంటీర్లపై చర్యలు తీసుకోలేదు. అయితే వలంటీర్ల అక్రమాలు, పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినా, వైసీపీ నేతలు అక్రమాలకు తెగబడ్డా టీడీపీకి ప్రజల్లో వస్తున్న మద్దతును ఆపలేకపోయారని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. పార్టీ గెలుపు శ్రేణుల్లో జోష్ పెంచిందని, రానున్న ఎన్నికల్లో మరింత ఆత్మస్థైర్యంతో పని చేసి పార్టీ గెలుపునకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

    Share post:

    More like this
    Related

    Jr NTR : ‘మ్యాన్ ఆఫ్ మాస్’కు అల్లు అర్జున్, మహేష్, చరణ్ శుభాకాంక్షలు..

    Jr NTR Birthday : ‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో కలిసి...

    Uyyuru Lokesh : వేటు పడుతున్నా మారని అధికారుల తీరు.. అరాచకాలకు హద్దు లేదా ?

    Uyyuru Lokesh : ఏపీలో వైసీపీ పాలనలో జరిగిన అరాచకాలు ఒక...

    IPL 2024 Playoffs : ప్లే ఆఫ్స్ కు వర్షం అంతరాయం.. రిజర్వ్ డే

    IPL 2024 Playoffs : కోల్ కతా  నైట్ రైడర్స్ రాజస్థాన్...

    Intelligence Alert : కాకినాడ, పిఠాపురంపై ఇంటెలిజెన్స్ హెచ్చరిక

    Intelligence Alert : అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Amaravati Movement : 1600వ రోజుకు చేరిన అమరావతి ఉద్యమం

    Amaravati Movement : అమరావతి ఉద్యమం 1600వ రోజుకు చేరుకున్న సందర్భంగా...

    Chandrababu : 2047 వరకు ఇండియా ఇలా ఉండబోతుంది.. చంద్రబాబు ప్రిడిక్షన్ వింటే గూస్ బంబ్స్ గ్యారెంటీ!

    Chandrababu : భారత్ భవిష్యత్ లో ఎలా ఉండబోతోందో చంద్రబాబు నాయుడు...

    CM Jagan : షర్మిల, రేవంత్ రెడ్డిపై ఏపీ సీఎం సంచలన వ్యాఖ్యలు

    CM Jagan : ఎన్నికల వేళ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న...

    TDP : వైసీపీని వీడి టీడీపీలో చేరిన 5 కుటుంబాలు

    TDP : ఈరోజు అచ్చంపేట మండలం కోనూరు గ్రామానికి చెందిన...