37.8 C
India
Saturday, May 18, 2024
More

    Viral Bride : పెళ్లి పీటలపై వరుడికి వధువు షాక్.. వధువు తల్లిదండ్రులకు వరుడు షాక్..

    Date:

    Viral Bride :

    తన ప్రేమ వ్యవహారం చెప్తే తల్లిదండ్రులు అంగీకరించకుండా ఎవరికో ఒకరికి ఇచ్చి కట్టబెట్టేవారు. అయినా నోరు మూసుకొని కాపురం చేసే కాలం పోయింది. తల్లిదండ్రులు, కుటుంబం పరువు లాంటివి అప్పుడు వారు పట్టించుకునే వారు. కానీ రాను రాను వాటిని మచ్చుకైనా పట్టించుకోవడం లేదు. ఇందులో ఇటు యువకుడు, అటు యువతి ఇద్దరూ ఇలానే ఉన్నారు. పితృ స్వామ్య వ్యవస్థ కాబట్టి యువకుడిని సమాజం పట్టించుకోదు. అదే యువతిపై మాత్రం దుమ్మెత్తి పోతుంది.

    యువతులు కూడా తమ ప్రేమ గురించి పెళ్లికి ముందు చెప్తే రచ్చ రచ్చ చేసి మరీ ఇష్టం లేని వారికి ఇచ్చి పెళ్లి చేస్తారని భావిస్తున్నారు. అందుకే చాక చక్యంగా వ్యవహరిస్తున్నారు. పెళ్లి చూపులకు ఒకే చెప్తున్నారు.. నిశ్చితార్థానికి ఒకే చెప్తున్నారు.. తీరా పెళ్లి పీటల సమయంలో ప్రేమించిన వారితో వెళ్లిపోతున్నారు. ఇలా అయితే అంతా బయట పడుతుంది.. ఎవ్వరూ ఏం చేయలేరు. ఇలాంటి ఘటనలు ఇప్పుడు సర్వ సాధారణం అయిపోయాయి. ఇలాంటి ఘటనే ఇక్కడ జరిగింది.. కానీ కల్పించుకున్న పోలీసులు వరుడికి న్యాయం చేశారు.

    కర్ణాటక రాష్ట్రం కోలాలలో ఈ ఘటన జరిగింది. ఒక యువతితో యువకుడికి వివాహం నిశ్చయమైంది. పెళ్లి చూపుల నుంచి సదరు యువతి యువకుడు తనకు నచ్చినట్లు చెప్తూ వచ్చింది. పెళ్లి చూపుల్లో ఓకే చేసి నిశ్చితార్థం చేసుకుంది. తీరా పెళ్లి పీటలపై కూర్చున్న ఆమె ‘ఈ పెళ్లి తనకు ఇష్టం లేదు. మరో యువకుడిని ప్రేమించాను. తల్లిదండ్రులు నాకు బలవంతంగా పెళ్లి చేస్తున్నారు. నేను చేసుకోను’ అంటూ చెప్పేసింది. దీంతో వరుడు షాక్ కు గురయ్యాడు. కుటుంబ సభ్యులు ఎంత చెప్పినా సదరు యువతి ఒప్పుకోకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు పెళ్లి కొడుకు. దీంతో వరుడి తరుఫు వారు పెళ్లి కోసం చేసిన ఖర్చును వధువు తరుఫు వారు ఇప్పించి పంపించి వేశారు.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Viral video : ఓటర్ ను కొట్టిన ఎమ్మెల్యే..తిరిగికొట్టిన ఓటర్..వైరల్ వీడియో

    Viral video : ఏపీలో పోలింగ్ కొనసాగుతోంది. పలువురు ప్రముఖులు తమ...

    Car Brakes Fail : కారు బ్రెయిక్ ఫెయిల్ అయితే ఇలా చేయండి!

    Car Brakes Fail : కారు నడపడం అనేది ఒక నైపుణ్యం....

    Crime News : ప్రేమికుడితో పాటు తానూ నిప్పంటించుకున్న యువతి

    Crime News : తన ప్రియుడు మరొకరికి దక్కకూడదని ఓ ప్రియురాలు...

    AP Elections 2024 : ‘వామ్మో వీడు మళ్లీ రాకూడదు’ ఏపీ అంతా ఇదే అంటుందా?

    AP Elections 2024 : ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ కు దాదాపు...