32.2 C
India
Friday, May 17, 2024
More

    Etala Rajender : మాజీ మంత్రి ఈటలకు ప్రాణహాని ? రంగం లోకి కేంద్రం!

    Date:

    Etala Rajender : 
    తెలంగాణకు చెందిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు  వై కేటగిరి భద్రత కల్పించేందుకు కేంద్రం నిర్ణయించింది.  మరో రెండు రోజుల్లో ఆయనకు భద్రత కల్పిస్తూ ఉత్తర్వులు జారీ కానున్నాయి.  ఈటలకు ప్రాణహాని ఉందని కేంద్ర ఇంటలిజెన్స్ వర్గాలు నిర్ధారించినట్లు సమాచారం. ఇప్పటికే ఏపీలో అధికార పార్టీని విభేదించిన ఎంపీ రఘురామకృష్ణరాజుకు ముప్పు ఉందని వై కేటగిరి భద్రత పెంచారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న ఈటల రాజేందర్ కు ఈ స్థాయి భద్రత పెంచడం మాత్రం ఊహించని పరిణామమే. ఈటల సతీమణి జమున ప్రెస్ మీట్లో తన భర్త ఈటల రాజేందర్ ను చంపడానికి కౌశిక్ రెడ్డి రూ.  రూ. 20 కోట్ల సుపారీ ఇవ్వడానికి సిద్ధపడ్డారని ఆరోపించారు. దీంతో పలుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర భద్రత ఇస్తారన్న సమాచారం బయటకు రాక ముందే ఈటల జమున చేసిన వ్యాఖ్యలు సంచలనగా మారాయి.  హుజూరాబాద్ కు చెందిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి కూడా వెంటనే ప్రెస్ మీట్ పెట్టాడు.  తాను ఎవరినీ హత్య చేయించడానికి ప్లాన్ చేయలేదని.. హత్యా రాజకీయాలు చేసేది ఈటలేనని ఆరోపించారు. ఈ తర్వాత ఈటల కూడా ప్రెస్ మీట్ పెట్టి తాను నయీంకే భయపడలేదని, ఈ సైకోకు భయపడతానా అంటూ కౌశిక్ రెడ్డిపై మండిపడ్డారు. ఇలా ముగ్గురి ప్రెస్ మీట్ల తర్వాత ఈటకు కేంద్ర భద్రత ఇస్తారన్న సమాచారం బయటకు వచ్చింది. కేంద్ర ప్రభుత్వం తన సొంత పార్టీ నాయకులకూ  ఈ స్థాయి  భద్రత కల్పించదు. అయితే ఈ అనూహ్య పరిణామాలతో నిజంగానే ఈటల విషయంలో ఏమైనా కుట్రలు జరుగుతున్నాయన్న అనుమానాలను  బీజేపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు.
     ఈటల భద్రతపై మంత్రి కేటీఆర్ ఆరా
    మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ తనకు ప్రాణ హానీ ఉందంటూ చేసిన ఆరోపణలపై మంత్రి కేటీఆర్ స్పందించినట్లు తెలుస్తున్నది. ఈటెల భద్రతపై మంత్రి ఆరాతీసినట్లు సమాచారం. డీజీపీ అంజనీకుమార్‌కు ఫోన్ చేసి ఈటెల భద్రతపై చర్చించినట్ల తెలుస్తున్నది. ఈటెల రాజేందర్ భద్రతపై సీనియర్ ఐపీఎస్ అధికారితో పరిశీలన జరిపించాలని సూచించారని సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం తరఫునే మరింత సెక్యూరిటీ ఇవ్వాలని మంత్రి సూచించినట్లు తెలుస్తున్నది.

    Share post:

    More like this
    Related

    America : అమెరికాలో రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్ వాసి మృతి

    America : అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ యువకుడు మృతి...

    Tirumala Ghat Road : తిరుమల ఘాట్ రోడ్డులో తప్పిన ప్రమాదం

    Tirumala Ghat Road : తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో పెను...

    AP Attacks : కేంద్ర నిఘా వర్గాల హెచ్చరిక..ఆ పార్టీ ఓడిపోతుందనే ప్రచారంతోనే దాడులు..

    AP Attacks : ఏపీలో ఎన్నికలు పూర్తయ్యే వరకు సుద్దపూసల్లాగా నీతులు...

    Vijayashanthi-KCR : రాముల‌మ్మకు కేసీఆర్ గుర్తుకు వస్తున్నారా.. ఆ ట్వీట్ అర్థం ఏంటో?

    Vijayashanthi-KCR : బీఆర్ఎస్‌ పార్టీపై సినీ నటి, రాజకీయ నాయకురాలు  విజయశాంతి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Etala Rajender : ఇంతకీ ఈటల దారెటు! బీజేపీలో ఉంటాడా..? పోతాడా..?

    Etala Rajender : తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేల రాజకీయాల్లో పెను మార్పులు...