
Etala Rajender : తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేల రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. చాలా మంది సీనియర్ నేతలు హస్తంతో చేతులు కలుపుతున్నారు. ఈ నేపథ్యంలో సీనియర్ నేత ఈటల రాజేందర్ పై కూడా కొన్ని రోజులుగా దుమారం రేగుతోంది. ‘బీజేపీలో ఆయన ఇమడడం లేదు.. బయటకు వస్తారు, హస్తం వైపు చూస్తున్న రాజేందర్’ అంటూ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల ఎన్ టీవీకి ఇచ్చిన మినీ ఇంటర్వ్యూలో కొన్ని విషయాలు చెప్పారు. ‘తెలంగాణ ఉద్యమం కోసం టీఆర్ఎస్ పార్టీలో చేరాను. దాదాపు 20 సంవత్సరాల కాలం అందులోనే పని చేశాను. ఇప్పడు బయటకు వచ్చాను. బట్టలు మార్చుకున్నట్లు పార్టీని మారే మనిషిని కాదు నేను’ అని చెప్పుకచ్చారు ఈటల రాజేందర్.
కర్ణాటక గెలుపు తర్వాత కాంగ్రెస్ తెలంగాణలో మంచి ఊపుమీదుందన్న విషయం అందిరికీ తెలిసిందే. ఇప్పటికే చాలా మంది నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరితో పాటు ఈటల, వెంకటస్వామి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఇలాంటి ప్రజాధరణ కలిగిన నేతలను రేవంత్ కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. దీనిపై ఈ విషయంపై గతంలో కొండా విశ్వేశ్వర్ కూడా మాట్లాడారు. అయితే ఈటల మాత్రం దీనిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. తన పార్టీలో తనకు వెన్నుపోటు పొడిచే వారు ఉన్నారని చెప్పిన ఆయన బీజేపీలోనే కొనసాగుతానని స్పష్టం చేస్తున్నారు.
ఎంపీ, ఎమ్మెల్యే పొంగులేటి శ్రీనివాస్, జూపల్లి కృష్ణారావు ఇటీవల ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. గతంలో వీరిని బీజేపీలోకి పట్టుకచ్చేందుకు ఈటల బాగా కష్టపడ్డారు. కానీ వారు ఆయననే కాంగ్రెస్ లోకి తీసుకెళ్లాలని ప్రయత్నించారు. అయినా ఆయన మాత్రం వెళ్లేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. ఇటీవల బీజేపీ ముఖ్య నాయకులను కలిసిన ఆయన పార్టీ తెలంగాణ భవితవ్యంపై చర్చించారు. ఎలాంటి నిర్ణయాలతో ఎన్నికల్లోకి వెళ్లాలో సూచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.