Cow attack : ఆవు అంటేనే మనకు గుర్తుకు వచ్చేది సాధు జంతువు. గడ్డితింటూ స్వచ్ఛమైన పాలిచ్చే తల్లిలాంటి జీవి. కానీ ఒక్కో్ సారి మాత్రం యమధూతగా కూడా మారుతుంది. వాడి లాంటి కొమ్ములతో దాడి చేస్తుంది. అసలు ఏం జరుగుతుందా? అని ఆలోచించే లోపే దాడి చేస్తుంది. ఇలాంటి ఘటన ఇక్కడ వీడియోలో చూడవచ్చు. పోయేది పోక వెనుకకు తిరిగి మరీ దాడి చేయడంతో చిన్నారి తీవ్ర గాయాలకు గురైంది.
పల్లెల్లో ఇప్పటికీ ఆవులు, గేదెలు వ్యవసాయ పని చేసి సాయంత్రం ఇంటికి వచ్చి కడుపునిండా గడ్డి తిని రాత్రంతా నెమరువేస్తూ ఉంటాయి. పొలంలో కష్టపడతాయి కాబట్టి సాయంత్రం అలసటగా ఉంటాయి. కానీ సిటీల్లో అలా కాదు. ఎలాంటి కష్టం లేకుండా ఇష్టం వచ్చినట్లు తిరుగుతాయి. వాటిని పోషించే వారు కూడా పచ్చగట్టి లేకపోవడంతో వదిలేస్తున్నారు. అవి వీధులు, రోడ్లపై తిరుగుతూ వచ్చీ వెళ్లే వారిని గాయపరుస్తుంటాయి. అవి స్వచ్ఛగా తిరిగే ప్రదేశాల్లో నివాసాలు ఏర్పరుచుకన్నామా? లేక మన నివాసాల్లోకి వాటికి స్వేచ్ఛ దొరకడం లేదా? తప్పంతా ఎక్కడ అన్నది అటుంచితే ఇక్కడ జరిగింది మరీ ధారుణం.
చెన్నై లోని ఎంఎండీఏ కాలనీలో తల్లితో పాటు పిల్లలు స్కూల్ కు వెళ్తున్నారు. వీరి ముందుగా ఆవు కాలనీలో తన దూడతో కలిసి వెళ్తుంది. పిల్లలు ఏమీ అనకున్నా. తన దూడను ఏమైనా అంటున్నారా? అని అనుమాన పడిందో ఏంటో ఆవు చిన్నారిపై విచక్షణా రహితంగా దాడి చేసింది. కొమ్ములతో పొడుస్తూ, కిందపడేసి కాళ్లతో తన్నుతూ తీవ్రంగా గాయపరిచింది. ఆవు దాడి చేస్తుంటే తన దూడ కూడా దాడి చేయడం మొదలు పెట్టింది. స్థానికులు ఎంత పెద్దగా వారించినా, బెదిరించినా ఆవు దాడిని చేయడం మాత్రం ఆపడం లేదు. దీంతో చిన్నారి తల, కడుపులో తీవ్రంగా గాయాలయ్యాయి. వెంటనే చిన్నారిని స్థానికంగా ఉన్న హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతున్నట్లు కనిపిస్తుంది.