Rashmika Mandanna : రష్మిక మందన్నను మేనేజర్ మోసం చేశారంటూ వార్తలు వచ్చాయి. గతంలో దేనిపై ఆమె స్పందించలేదు. ఈ మధ్య సోషల్ మీడియాలో ఈ పోరు ఎక్కువైంది. ఎట్టకేలకు ఒక ప్రకటన విడుదల చేసింది. అది కూడా అధికారికంగానే. ‘మా మధ్య ఎలాంటి శతృత్వం లేదు. కెరీర్ లో ఎవరికి వారు ఎదగాలని నిర్ణయించుకున్నాం. అందుకు ముందుగా మాట్లాడుకొని పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నాం. కెరీర్ పరంగా ఇద్దరం ప్రొఫెన్సియల్స్ ఎక్కడైనా పనికి కట్టుబడి ఉంటాం’. అంటూ తెలిపింది రష్మిక.
రష్మిక కెరీర్ లో దూసుకుపోతోంది. వరుస హిట్లతో ఆమె క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. ఈ నేపథ్యంలో ఆమె పర్సనల్ మేనేజర్ ఒకరు ఆమెను ఆర్థికంగా మోసం చేశాడని, రూ. 80లక్షలు ఆమెకు తెలియకుండా కాజేసినట్లు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అయితే అసలు విషయం తెలుసుకున్న మందన్న సదరు మేనేజర్ ను తొలగించినట్లు గాసిప్ లతో పాటు సినిమా పత్రిల్లో కథనాలు కూడా వచ్చాయి. అయితే తన కెరీర్ స్ట్రార్ట్ అయినప్పటి నుంచి ఆమె వద్ద పని చేసే మేనేజర్ ఇలా వ్యవహరించడంతో ఆమె కూడా చాలా బాధపడినట్లు బాలీవుడ్ మీడియా పేర్కొంది. అప్పట్లో ఇవన్నీ పుకార్లు కావచ్చు అనకున్నారు. సినిమా వార్తల్లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఎక్కువగా రచ్చ కావడంతో ఆమె స్పందించారు. కాని ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా తొలగించడంపై సినీ వర్గాల్లో కొంత ఆశ్చర్యం కలిగింది.
ప్రస్తుతం రష్మిక కెరీర్ మంచి ఊపుమీదుంది. పుష్ప పార్ట్ 1లో ఆమె నటనతో అదరగొట్టింది. ఇక పుష్ప పార్ట్ 2 షూటింగ్ లో ఉంది. యానియల్ సినిమా కూడా రెండు రోజులకు ముందే షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. బాలీవుడ్ యాక్టర్ రణ్ బీర్ కపూర్, రష్మిక మందనతో అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ వంగా యానిమల్ చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసుకొని ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది.
ReplyForward
|