33.6 C
India
Monday, May 20, 2024
More

    Delhi Ordinance Bill : అసలేంటి ఢిల్లీ అర్డినెన్స్ బిల్లు.. ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి..

    Date:

    Delhi Ordinance Bill :

    ఢిల్లీ అర్డినెన్స్ బిల్లు పై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. పార్లమెంట్ మోదీ సర్కారు ఈ బిల్లు పెడుతుండగా, ప్రతిపక్షాల కూటమి దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. అయితే ఢిల్లీ ఫై పెత్తనం కోసం ఇటు కేంద్రం, అటు రాష్ర్ట ప్రభుత్వం కొట్లాడుతున్నాయి. రాష్ర్టానికి అనుకూలంగా సుప్రీం కోర్టులో తీర్పు రావడంతో కేంద్రానికి ఎదురుదెబ్బ తగిలింది. పరిపాలన తమ చేతుల్లోనే ఉండాలని కేంద్రం భావిస్తున్నది. ఈ మేరకు రాజధానిలో అధికారంలో ఉన్న కేజ్రీవాల్ ప్రభుత్వ సేవలపై నియంత్రణ విధిస్తూ ఈ ఆర్డినెన్స్ నుమోదీ సర్కారు ప్రస్తుతం తీసుకొచ్చింది. సమంగళవారం జరిగిన లోక్ సభ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టింది.

    అయితే ఢిల్లీలో అధికారుల బదిలీలు, నియామకాల విషయంలో తీసుకొచ్చిన ఆర్డినెన్స్ స్థానంలో రూపొందించిన ‘ది గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెర్రిటొరీ ఆఫ్ ఢిల్లీ 2023’ బిల్లును కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) సభలో ప్రవేశ పెట్టారు. ఇకపై ఢిల్లీకి సంబంధించిన ఏ చట్టాన్నైనా లోక్ సభలో రూపొందించేలా చట్టాన్ని రాజ్యాంగం కల్పించింది అని
    ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇక ఈ బిల్లుకు ఆమోదం పడితే ఢిల్లీలోని అధికారులపై సర్వధికారాలు కేంద్రానికే ఉంటాయి. నియామకాలు, బదిలీల అంశం కేంద్రం నియంత్రణలోకి వెళ్తుంది. ఢిల్లీ ప్రభుత్వానికి మాత్రం ఎలాంటి అధికారాలు ఉండవు. ఈ నేపథ్యంలోనే ఈ బిల్లును ఢిల్లీలోని కేజ్రివాల్ సర్కారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. కేజ్రీవాల్ ఆందోళనకు విపక్ష ఇండియా కూటమి పార్టీలుఅండగా నిలిచాయి. ఈ బిల్లుపై వీరంతా లోక్ సభలో నిరసన చేపట్టారు.

    దేశ రాజధానిలోని సర్వాధికారాలు గవర్నర్ కి అప్పగించేలా కేంద్రం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. దీన్ని ఆది నుంచి ఢిల్లీ ప్రభుత్వం వ్యతిరేకిస్తూ వస్తున్నది. మరోవైపు కేంద్రం తెస్తున్న ఈ ఆర్డినెన్స్ పైకేజ్రివాల్ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన బెంచ్ మే 11న కీలక తీర్పు ఇచ్చింది. పోలీస్‌, ప్రజాధికారాలు, భూ వ్యవహారాలు మినహా ఢిల్లీలోని మిగతా అన్ని శాఖలు, విభాగాలు, సేవల నియంత్రణ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికే ఉంటుందని స్పష్టం చేసింది.

    Share post:

    More like this
    Related

    Cognizant : ఆఫీసుకు రాకుంటే జాబ్ నుంచి తీసేస్తాం: కాగ్నిజెంట్

    Cognizant : ఉద్యోగులంతా కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని, ఈ నిబంధనను...

    Arvind Kejriwal : ఆప్ అంతానికి బీజేపీ ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్

    Arvind Kejriwal : ఆప్ నేతలను అరెస్టు చేసి జైళ్లకు పంపించేందుకు...

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Amit Shah : బీఆర్ఎస్ లాగే కాంగ్రెస్ అప్పులు చేస్తోంది: అమిత్ షా

    Amit Shah : గత ప్రభుత్వం బీఆర్ఎస్ అప్పులు చేసినట్లే కాంగ్రెస్...

    Amit Shah : తెలంగాణలో డబుల్ డిజిట్ స్కోరు సాధిస్తాం: కేంద్ర హోం మంత్రి అమిత్ షా

    Amit Shah : ఈసారి లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో డబుల్...

    Amit Shah : ప్రజల తిరస్కరించడంతో నే చంద్రబాబును మళ్లీ NDA లోకి వచ్చాడు.. అమిత్ షా కీలక వ్యాఖ్యలు

    గతంలో బిజెపిని తిట్టిన చంద్రబాబు నాయుడుతో ఎందుకు మీరు పొత్తు పెట్టుకున్నారని...

    Amit Shah : జగన్ తో పొత్తెందుకు లేదు? అమిత్ షా ఏమన్నారంటే?

    Amit Shah : కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లులకు మద్దతునిచ్చిన జగన్తో పొత్తు ఎందుకు...