Shriya Saran దాదాపు ఇరవై ఏళ్లకు పైగానే శ్రీయ శరన్ తెలుగు తెర మీద తిరుగులేని స్టార్ డమ్ ను అనుభవిస్తూ.. తెలుగు, తమిళ్ లో స్టార్ హీరోలందరితో ఆడిపాడింది.. వరుస అవకాశాలు అందుకుని ఎన్నో సూపర్ హిట్స్ ను తన ఖాతాలో వేసుకుంది.. అలాగే పెళ్లి చేసుకుని కూతురు పుట్టిన తర్వాత శ్రీయ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి ఇప్పుడు కూడా కెరీర్ లో దూసుకు పోతుంది..
ఇప్పటికి కూడా స్టార్ హీరోల సినిమాల్లో కీ రోల్స్ వస్తే తప్పకుండ గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది.. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ మంచి పేరు తెచ్చుకుంటుంది.. ఇక ఈమె సినిమాలు చేస్తూనే ఈ మధ్య సోషల్ మీడియాలో శృతిమించి అందాల ఆరబోతకు తెరలేపింది. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ హాట్ టాపిక్ అవుతుంది.
ఇకపోతే ఈమె తాజాగా ఒక నిర్మాత గురించి చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక ఈ మధ్య ప్రతీ ఒక్కరు కాస్టింగ్ కౌచ్ మీద మాట్లాడుతున్న నేపథ్యంలో తాజాగా శ్రీయ కూడా ఈ విషయంపై స్పందించింది. ఈమెకు కూడా ఒకానొక దశలో కాస్టింగ్ కౌచ్ సమస్య ఎదురయ్యింది అని చెప్పుకొచ్చింది.
నేను తెలుగులో రెండు సినిమాలు చేసిన తర్వాత కోలీవుడ్ నిర్మాత కాల్ చేసాడు.. అప్పుడు సినిమా గురించి ఎక్కువుగా హోటల్స్ లోనే డిస్కర్షన్స్ జరిగేవి.. ఆయన హోటల్ కు ఒంటరిగా రమ్మనగా సరే అని వెళ్ళాను.. వెళ్ళాక సినిమాలో ఛాన్స్ ఇస్తాను కానీ నాతో క్లోజ్ గా ఉండాలి.. నేను పార్టీ ఇచ్చినప్పుడు ఒంటరిగా రావాలని చెప్పుకొచ్చాడు. ఆయన ఉద్దేశం నాకు అర్ధం అయ్యి ఆయన నెంబర్ బ్లాక్ చేశా.. మళ్ళీ అతడిని నేను ఎప్పుడు కలవలేదు అని చెప్పుకొచ్చింది.