Stray Dogs : మహబూబ్ నగర్ జిల్లాలో వీధికుక్కల కాల్చివేత కలకలం రేపుతోంది. అడ్డాకుల మండలం పొన్నకల్ లో గురువారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు వీధి కుక్కలను కాల్చి చంపిన ఘటన స్థానికంగా వెలు గు లోకి వచ్చింది. గ్రామంలో అర్థరాత్రి వాడవడాల తిరిగి 20 శునకాలను నాటుతుపా కీతో చంపిన దుండగులు ఎందుకు ఈ ఘాతు కానికి పాల్పడ్డారో అటు అధికారులకు, ఇటు గ్రామస్థులకు అంతు చిక్కడం లేదు.
అడ్డాకుల ఎస్సై శ్రీనివాసులు ఆధ్వర్యంలో పోలీ సులు శుక్రవారం గ్రామస్థుల నుంచి వివరాల ను సేకరించారు. అనంతరం మహబూబ్ నగర్ నుంచి క్లూ టీం ఇన్ స్పెక్టర్ రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో బృందాన్ని రప్పించి వీధుల్లో కుక్కులపై దాడి జరిగిన ప్రదేశాలను పరిశీలించారు.
కుక్కల కళేబరాలకు గ్రామ సమీపంలోని డంపింగ్ యార్డు దగ్గర మండల పశువైద్యాధికారి రాజేశ్ ఖన్నా ఆధ్వర్యంలో పోస్టు మార్టం నిర్వహించి …నమూనాలను సేకరించి హైదరాబాద్ లోని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. గాయపడిన నాలుగు శునకాలకు ఇంజెక్షు ఇచ్చి వైద్యం అంది స్తున్నట్లు అధికారులు తెలిపారు. పొన్నకల్ కార్య దర్శి విజయరామరాజు ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు భూత్పూరు సీఐ రామక్రుష్ణ తెలిపారు.