Viral Photo : ఈ ఫొటోలని చిన్నారులను చూస్తే ఏదో సాదాసీదాగా కనిపిస్తున్నారేంటి అనుకుంటున్నారా. అయితే మీరు పప్పులో కాలేసినట్లే. కనీసం వారిని గుర్తుపట్టడానికి ప్రయత్నం చేయండి అంటే చాలా మంది గుర్తు పట్టలేకపోతున్నారు. వారిద్దరూ ఇప్పుడు దేశంలోనే బడా హిరోలుగా గుర్తింపు తెచ్చుకుని ఫిట్ నెస్, డ్యాన్స్, నటనలో అదరగొడుతూ ప్రేక్షకుల మదిలో నిలిచిపోయారు.
అలాంటి ఇద్దరు చిన్ననాటి స్నేహితులు ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హిరోలుగా వెలుగొందుతున్నారు. వారిద్దరు బాలీవుడ్ హిరోలు అయినప్పటికీ ఇప్పటి వరకు క్లాస్ మేట్స్ అనే విషయం చాలా మంది కి తెలియదు. ఇంతకీ వారెవరో చెప్పలేదు కదా? వైట్ షర్టులో కనిపిస్తున్న బుడతడు బాలీవుడ్ స్టార్ హిరో హృతిక్ రోషన్, బ్రౌన్ కలర్ షర్టులో చివరగా నిలుచున్న చిన్నోడు జాన్ అబ్రహం.
నిజంగానే వీరిద్దరూ క్లాస్ మేట్సా అని అందరూ షాక్ కు గురవుతున్నారు. జాన్ అబ్రహం, హృతిక్ రోషన్ ఇద్దరు ఒకే స్కూల్ లో చదువుకున్నారు. హృతిక్ రోషన్ తండ్రి నిర్మాత రాకేశ్ రోషన్ బాలీవుడ్ లో అనేక సినిమాలను తెరకెక్కించాడు. బాలీవుడ్ లో హృతిక్ కూడా బాల నటుడిగా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత హిరోగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. జాన్ అబ్రహం అంటేనే ఫిట్ నెస్ కు మారుపేరు. కొన్ని సంవత్సరాలుగా తను ఎంత డైట్ పాటించాడో తెలుస్తే షాక్ కు గురవుతారు. కనీసం 20 ఏండ్లుగా షుగర్ తీసుకోలేదంటా.. ఫిట్ నెస్ అంటే అతడికి అంత ఇష్టం.
ప్రస్తుతం బాలీవుడ్ లో పాన్ ఇండియా మూవీ ‘వార్ 2’ హృతిక్ రోషన్ హిరోగా తెరకెక్కుతోంది. ఇందులో పాన్ ఇండియా సూపర్ స్టార్ ఎన్టీఆర్ కూడా నటిస్తున్నాడు. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ సినిమా ను యశ్ రాజ్ ఫిల్మ్స్ తెరకెక్కిస్తోంది. అయితే జాన్ అబ్రహం 2003 లో బిపాసా బసుతో కలిసి జిస్మ్ సినిమాతో అరంగ్రేటం చేశాడు. ప్రస్తుతం ఈ ఇద్దరి చిన్నప్పటి ఫొటో వైరల్ కావడంపై అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.