37.7 C
India
Saturday, May 18, 2024
More

    Natural Actor : ఈ కుర్రాడిప్పుడు టాలీవుడ్ ను ఏలుతున్న సహజ నటుడు

    Date:

    Natural Actor
    Natural Actor

    Natural Actor : సినిమా ఇండస్ర్టీ ఎవరిని, ఎప్పుడు స్టార్లుగా మార్చుతుందో ఎవరికీ తెలియదు. ఎవరు స్టార్ డమ్ ఎప్పుడు డౌన్ అవుతుందో ఎవరూ చెప్పలేరు. సినీరంగంలో రాణించాలనే కలలతో లైట్ బాయ్ దగ్గర కెరీర్ మొదలు చేసిన స్టార్ హీరోగా ఎదిగిన వారు ఉన్నారు. దర్శకులుగా వెండితెర మీద తమకంటూ ఓ పేజీని క్రియేట్ చేసుకున్నవారు ఉన్నారు.

    తమకు నచ్చిన రంగంలో రాణించేందుకు కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న క్యారెక్టర్లతో మెప్పించి ప్రస్తుుతం తమ ప్రతిభతో వెండితెరపై వెలిగిపోతున్న వారు ఉన్నారు. మరికొందరు అసిస్టెంట్ డైరెక్టర్ గా ఓనమాలు దిద్ది హీరోలుగా ఎదిగారు. ఆ జాబితాలో ఈ చిన్నోడు కూడా ఒకరు. ఈ ఫొటోలో ఓ స్టార్ హీరో కూడా ఉన్నాడు. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండానే ఒంటరిగా ఫిలిం ఇండస్ట్రీ వైపు నడిచాడు. అసిస్టెంట్ దర్శకుడిగా కెరీర్ ఆరంభించి ఇప్పుడు హీరోగా తనకంటూ ఓ రేంజ్ సృష్టించుకున్నాడు.

    టాలీవుడ్ లో ఎలాంటి సపోర్ట్ లేకుండా నటీనటులుగా నిలదొక్కుకున్న వాళ్లు చాలా మందే ఉన్నారు. ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకోవాలనే లక్ష్యంతో ఎన్నో అడ్డంకులు, మరెన్నో అవాంతరాలను దాటుకొని ఇప్పుడు సక్సెస్ లు కొట్టి  ఇప్పుడు స్టార్ హీరోలుగా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రలు వేసి ఇప్పుడు తమ ప్రతిభతో సిల్వర్ స్ర్కీన్ పై హీరోలుగా రాణిస్తున్నారు. ఆ కోవలో ఈ చిన్నోడు కూడా ఒకరు.

    అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ ప్రారంభించి ఇప్పుడు హీరోగా ఇండస్ట్రీలో రాణిస్తున్నాడు. అతనే మన నేచురల్ స్టార్ నాని. ఈ ఫోటోలో చిరునవ్వులు చిందిస్తూ పక్కకు చూస్తున్న కుర్రాడు నానినే.

    నేచురల్ స్టార్ నాని అసిస్టెంట్ డైరెక్టర్గా ప్రారంభించాడు. కెరీర్ మొదట్లోనే దిగ్గజ దర్శుకులు బాపు, రమణ వద్ద సహాయ దర్శకుడిగా పనిచేశాడు. ఆ తర్వాత అష్టాచమ్మా సినిమాతో హీరోగా టాలీవుడ్ కు ప పరిచయమయ్యాడు. మొదటి సినిమాతోనే నటుడిగా మంచి మార్కులు కొట్టేశాడు నాని. ఆ తర్వాత అలా మొదలైంది సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత నాని వెనుదిరిగి చూసుకోలేదు ఇక. ప్రస్తుతం వరుస విజయాలతో  దూసుకుపోతున్నాడు. దసరా సినిమాతో పాన్ ఇండియా గా హీరోగా పేరు తెచ్చుకున్నాడు. తన నటనతో పక్కింటి కుర్రాడిలా కనిపిస్తూ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. యాక్షన్, ఎంటర్ టైనర్.. సినిమాల్లోనూ ఒదిగిపోతున్నాడు.

    ఇటీవల హాయ్ నాన్న చిత్రంతో మరో మంచి విజయం అందుకున్నాడు. అంతకు ముందు జెర్సీ సినిమాలో తండ్రి క్యారెక్టర్ లో మెప్పించిన నాని..ఈసారి హాయ్ నాన్న సినిమాలోనూ మరోసారి తండ్రిగా ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం హీరోగా సరిపోదా శనివారం సినిమా చేస్తున్నాడు .ఇందులో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్. ఈ సినిమా సెట్స్ మీద ఉన్నది.

    Share post:

    More like this
    Related

    Hardik Pandya : హర్దిక్ పాండ్యాపై నిషేధం

    Hardik Pandya : హర్దిక్ పాండ్యాపై ఐపీఎల్ ఫ్రాంచైజీ నిషేధం విధించింది. ఇప్పటికే...

    RGV : సీఎం రేవంత్ రెడ్డి చెంతకు ఆర్జీవీ.. 

    RGV : సీఎం రేవంత్ రెడ్డి ఆర్జీవీ చెంతకు చేరారు. మూవీ డైరెక్టర్స్...

    Road Accident : పెళ్లి బట్టల కోసం వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం..

    - ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి Road Accident : ఆంధ్రప్రదేశ్...

    Crime News : తీర్థయాత్రకు వెళ్లి వస్తుండగా బస్సు దగ్ధం..

    - 8 మంది మృతి.. 20 మందికి గాయాలు Crime News :...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related