Surya Kumar viral : కొందరు నిద్రపోతే నోరు తెరుస్తారు. ఇంకా కొందరికి వెన్నంటుకుంటేనే కన్నంటుకుంటుంది. మధ్యాహ్నం సమయంలో కాస్త కునుకు తీస్తే శరీరం ఎంతో హాయిగా ఉంటుందని వైద్యులు సైతం చెబుతున్నారు. దీంతో నిద్ర పోవడంతోనే కొందరు మాత్రం నోరు వెళ్లబెడతారు. ముక్కులో నుంచి కాకుండా నోట్లో నుంచి శ్వాస తీసుకుంటారు. గురక కూడా పెడతారు. ఈ నేపథ్యంలో నిద్రపోయే వారు చనిపోయిన వారు సమానమనే అందుకే అంటారు.
తాజాగా లక్నోతో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ జయభేరి మోగించింది. దీంతో రెండో క్వాలిఫయర్ మ్యాచ్ కోసం అహ్మదాబాద్ కు విమానంలో వెళ్తున్నారు. విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో బ్యాటర్ తిలక్ వర్మ నోరు తెరచి నిద్రపోతున్నాడు. ఇది గమనించిన సూర్యకుమార్ యాదవ్ ఓ నిమ్మకాయ తీసుకుని అతడి నోట్లో పిండాడు.
వెంటనే తేరుకున్న తిలక్ కు ఏం జరిగిందో అర్థం కాలేదు. కానీ జరిగింది తెలుసుకుని నవ్వుకున్నాడు. తిలక్ వర్మ నోట్లో సూర్యకుమార్ యాదవ్ నిమ్మకాయ పిండటంతో పుల్లగా అనిపించి నిద్ర నుంచి లేచాడు. తాను నిద్రపోయేటప్పుడు సూర్య అలా చేయడంలో నిద్ర మత్తు వీడింది. అందరు నవ్వుకున్నారు. గమ్మత్తయిన పని కావడంతో ముసిముసి నవ్వుకున్నాడు.
ఒక్కోసారి అలా జరుగుతుంది. కానీ కొందరు కోపానికి వస్తారు. నిద్ర నుంచి లేపితే ఆగ్రహంతో ఊగిపోవడం సహజమే. తిలక్ మాత్రం అలా చేయలేదు. జరిగిన దానికి సరదాగా తీసుకున్నాడు. దీంతో అందరు హాస్యంగానే భావించారు. మనసారా నవ్వుకున్నారు. ఇలాంటి విచిత్ర సంఘటనలు ఎప్పుడో ఒకప్పుడు జరిగి అందరిలో ఆశ్చర్యాన్ని నింపుతాయి.