Today Horoscope (13th August ) : మేష రాశి వారికి మంచి కాలం. చేపట్టే పనుల్లో సానుకూలత ఉంటుంది. ప్రశాంతమైన వాతావరణంలో ముందుకు సాగుతారు. ఈశ్వర దర్శనం చాలా మంచిది.
వ్రషభ రాశి వారికి పనుల్లో ఆటంకాలు ఉన్నప్పటికి పూర్తి చేస్తారు. కీలక నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళతారు. దుర్గాదేవి ధ్యానం చేయడం మంచి ఫలితాలు వస్తాయి.
మిథున రాశి వారికి మంచి కాలం. ఒక శుభవార్త సంతోషం కలిగిస్తుంది. బంధు మిత్రులతో ఆనందంగా గడుపుతారు. శని జపం చేయడం వల్ల శుభాలు కలుగుతాయి.
కర్కాటక రాశి వారికి పనుల్లో మందకొడి ఉంటుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు పాటించాలి. శ్రమ పెరుగుతుంది. శివ నామాన్ని జపించడం వల్ల మంచిది.
సింహ రాశి వారికి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. భవిష్యత్ ప్రణాళికలు వేసుకుంటారు. గురుధ్యానం చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.
కన్య రాశి వారికి మంచి ఫలితాలు ఉన్నాయి. భవిష్యత్ గురించి ఆలోచిస్తారు. నూతన పరిచయాలు ఏర్పడతాయి. ఇష్ట దైవాన్ని ప్రార్థించడం వల్ల మంచి జరుగుతుంది.
తుల రాశి వారికి ఉద్యోగ వ్యాపారాల్లో ఆటంకాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒత్తిడి పెరగకుండా చూడాలి. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ఈశ్వర ధ్యాన శ్లోకం చదివితే మేలు కలుగుతుంది.
వ్రశ్చిక రాశి వారికి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటుకు గురవుతారు. పనుల్లో ఆటంకాలు లేకుండా చూసుకోవాలి. శని శ్లోకం చదవడం వల్ల మంచి ఫలితాలుంటాయి.
ధనస్సు రాశి వారికి చేపట్టే పనులు పూర్తవుతాయి. అధికారుల సాయంతో పనులు జరుగుతాయి. సూర్య భగవానుడిని ఆరాధించడం వల్ల శుభాలు కలుగుతాయి.
మకర రాశి వారికి ఉద్యోగ వ్యాపారాల్లో శుభాలు కలుగుతాయి. ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇష్టదేవతారాధన చేస్తే మంచి ఫలితాలు రావడం జరుగుతుంది.
కుంభ రాశి వారికి ఆకస్మిక ధనలాభం ఉంటుంది. జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ప్రయాణాల్లో లాభాలుంటాయి. దుర్గా దేవి ధ్యానం చేయడం వల్ల మేలు కలుగుతుంది.
మీన రాశి వారికి చేపట్టే పనుల్లో విజయం సాధిస్తారు. ఆకస్మిక ధన లాభం ఉంది. గతంలో చేసిన తప్పులు మళ్లీ చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. లింగాష్టకం చదివితే మంచిది.