38.7 C
India
Saturday, May 18, 2024
More

    Vijay Devarakonda : విజయ్ దేవరకొండ తగ్గేదేలే.. వరుస సినిమాలతో బిజీబిజీ

    Date:

    Vijay Devarakonda
    Vijay Devarakonda

    Vijay Devarakonda : ‘ఫ్యామిలీ స్టార్’ మూవీ మిక్స్ డ్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. దిల్ రాజు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కించినా..కథలో కొత్తదనం లేకపోవడంతో జనాలను అంతగా ఆకట్టుకోలేకపోయింది. నిజానికి ఈ సినిమాపై విజయ్ దేవరకొండ, దిల్ రాజు భారీ అంచనాలు పెట్టుకున్నారు. విజయ్ కు గత కొంత కాలంగా సరైన హిట్ లేదు. దీంతో కెరీర్ కు డ్యామేజీ పడే అవకాశాలు ఉండడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందారు. అయితే ఈ విషయాలపై విజయ్ పెద్దగా ఆలోచించడం లేదు. వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే ఉన్నాడు.

    ఈ నేపథ్యంలో తన కొత్త సినిమాను ప్రకటించాడు విజయ్ దేవరకొండ. ఈ మూవీకి రవికిరణ్ కోలా దర్శకత్వం వహించనున్నాడు. ‘రాజావారు..రాణిగారు’తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రవికిరణ్ తొలి సినిమాతోనే విజయాన్ని సొంతం చేసుకున్నాడు. రెండో సినిమానే విజయ్ తో చాన్స్ కొట్టేశాడు. టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను నిర్మించనున్నాడు. ఫ్యామిలీ స్టార్ సక్సెస్ తో సంబంధం లేకుండా విజయ్ దేవరకొండతో మరో మూవీ ప్లాన్ చేయడం.. దిల్ రాజు గట్స్ ను మెచ్చుకోవాల్సిందే.

    అయితే గతేడాదిలోనే  దిల్ రాజు బ్యానర్ లో సినిమా తీయనున్నట్లు రవికిరణ్ ప్రకటించాడు. అప్పటి నుంచి ఎలాంటి అప్ డేట్స్ లేకపోవడంతో దీనిపై రకరకాల వార్తలు వచ్చాయి. తాజాగా వీటికి చెక్ పెడుతూ వివరాలు వెల్లడించారు. రూరల్ యాక్షన్ డ్రామాగా ఇది తెరకెక్కనుంది. పూర్తి వివరాలను విజయ్ దేవరకొండ పుట్టిన రోజు సందర్భంగా మే 9న ప్రకటించనున్నట్లు మూవీ యూనిట్ తెలిపింది.

    కాగా ప్రస్తుతం విజయ్ దేవరకొండ.. గౌతమ్ తిన్ననూరితో ఓ సినిమా చేస్తున్నాడు. ఇందులో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. సితార ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై రానున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో విజయ్ దేవరకొండ గూఢచారి పాత్రలో కనిపించనున్నాడు. యాక్షన్ థ్రిల్లర్ గా ఇది రానుంది. హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ఫ్యాన్స్ ను ఇక విజయ్ అలరించనున్నాడు.

    Share post:

    More like this
    Related

    Hardik Pandya : హర్దిక్ పాండ్యాపై నిషేధం

    Hardik Pandya : హర్దిక్ పాండ్యాపై ఐపీఎల్ ఫ్రాంచైజీ నిషేధం విధించింది. ఇప్పటికే...

    RGV : సీఎం రేవంత్ రెడ్డి చెంతకు ఆర్జీవీ.. 

    RGV : సీఎం రేవంత్ రెడ్డి ఆర్జీవీ చెంతకు చేరారు. మూవీ డైరెక్టర్స్...

    Road Accident : పెళ్లి బట్టల కోసం వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం..

    - ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి Road Accident : ఆంధ్రప్రదేశ్...

    Crime News : తీర్థయాత్రకు వెళ్లి వస్తుండగా బస్సు దగ్ధం..

    - 8 మంది మృతి.. 20 మందికి గాయాలు Crime News :...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular