ఇదిలా ఉండగా ఈ ఏదో నడుస్తుంది అని పాన్ ఇండియా వ్యాప్తంగా ఫ్యాన్స్ కు గట్టి ఫీలింగ్.. విజయ్ దేవరకొండ – రష్మిక పెయిర్ టాలీవుడ్ ప్రేక్షకులకు బాగా ఇష్టం.. గీతా గోవిందం సినిమాలో వీరి కెమిస్ట్రీకి అందరు ఫిదా అయ్యారు.. అప్పటి నుండి వీరి మధ్య ఏదో నడుస్తుంది అని తరచు వార్తలు వస్తూనే ఉన్నాయి.. ఈ వార్తలను ఎప్పటికప్పుడు ఇద్దరు ఖండిస్తూనే ఉన్న రూమర్స్ మాత్రం ఆగడం లేదు.
అయితే వీరిద్దరూ విడిపోయారని మధ్యలో కొత్త డౌట్ లు క్రియేట్ అయ్యాయి. కానీ వీటన్నిటికీ ఈ రోజుతో ఈ జంట ఫుల్ స్టాప్ పెట్టింది. అయితే ఈ ఇద్దరు మళ్ళీ చాలా రోజుల తర్వాత బయట కనిపించడంతో వీరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. వీరిద్దరూ కలిసి లంచ్ డేట్ కోసం కలిసి ఒక రెస్టారెంట్ కు వెళ్లారు.. అక్కడ ఇద్దరు కలిసి సరదాగా మాట్లాడుకున్నట్టు తెలుస్తుంది.
రష్మిక, విజయ్ మాత్రమే కాకుండా ఆయన సోదరుడు ఆనంద్ దేవరకొండ, కొంత మంది కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ అందరు కలిసి సరదాగా కలిసి లంచ్ చేసారు.. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఏది ఏమైనా వీరిద్దరిపై వచ్చిన రూమర్స్ నిజం కాకపోవడంతో ఫ్యాన్స్ సంతోషంగా ఉన్నారు.. ఇక కెరీర్ లో అయితే ఈ ఇద్దరు పలు క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.