35.8 C
India
Monday, May 20, 2024
More

    Interest on FDs : ఎఫ్‌డీలపై మంచి వడ్డీ అందుకోవాలనుకుంటున్నారా..? ఇది మీ కోసమే..

    Date:

    interest on FDs
    interest on FDs

    Interest on FDs : జీవితంలో ఏదో ఒక సమయంలో డబ్బులు అవసరం అవుతాయని భావించే వారు ఎక్కువగానే ఉంటారు. అదీ ఇండియాలో అయితే ఎక్కువ మంది ఉంటారు. వారి కోసమే బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లు (ఎఫ్‌డీ) తీసుకువచ్చింది. దీనిపై ఆయా బ్యాంకులు వడ్డీని కూడా చెల్లిస్తాయి. ప్రభుత్వ బ్యాంకులు ఒక రకంగా చెల్లిస్తే ప్రైవేట్ బ్యాంకులు మరోలా చెల్లిస్తాయి. మొత్తంగా ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారమే ఉంటాయి. అయితే, ఇందులో ఏ బ్యాంకులు ఎఫ్‌డీలకు మెరుగైనవి.. ఏ బ్యాంకులు ఎఫ్‌డీలకు తక్కువ వడ్డీ ఉంది అనేది ఇక్కడ చూద్దాం.

    ప్రస్తుతం ఉన్న బ్యాంకుల్లో చాలానే ఎఫ్‌డీపై అధిక వడ్డీ రేట్లను ఇస్తున్నాయి. ఆర్బీఐ 2022 నుంచి వడ్డీ రేట్లను పెంచడంతో దానికి అనుగుణంగా బ్యాంకులు కూడా వడ్డీ రేటును పెంచాయి. మధ్యలో రెండు పాలసీలను తీసుకువచ్చిన ఆర్బీఐ వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. ఈ నేపథ్యంలో కొంత మేరకు వడ్డీ తగ్గవచ్చని ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుత కాలం ఎఫ్‌డీలకు సానుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. సాధారణంగా ప్రభుత్వ రంగ బ్యాంకులతో పోలిస్తే ప్రైవేట్ బ్యాంకులు వడ్డీ రేట్లను కొంచెం మేరకు ఎక్కువగానే ఇస్తాయి. సాధారణ వినియోగదారుల కంటే సీనియర్ సిటిజన్లకు .50 శాతం ఎక్కువ చెల్లిస్తున్నాయి బ్యాంకులు.

    అయితే బ్యాంకులు అందించే ఎఫ్‌డీలపై వడ్డీ రేట్ల పెట్టుబడి మొత్తం, పెట్టుబడిదారుల కేటరిగి, కాలవ్యవధిని బట్టి మారుతుంటాయి. డిపాజిట్ సమయం పూర్తవడంతో అసలు, వడ్డీ కలిపి డిపాజిట్ దారుడికి అందిస్తాయి. ఈ క్రమంలో ప్రధాన 10 బ్యాంకులు రూ. 2 కోట్ల కంటే ఎక్కువ మొత్తాలపై అందించే రేట్ల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

    ఏఏ బ్యాంకులో.. ఎంతెంత వడ్డీ..

    స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బీఐ): 3 శాతం నుంచి 7.10 శాతం వరకు
    హెచ్ డీఎఫ్ సీ: 3 నుంచి 7.25 వరకు
    ఐసీఐసీఐ: 3 నుంచి 7.10 వరకు
    పంజాబ్ నేషనల్ : 3.50 నుంచి 7.25 వరకు
    యాక్సిక్ : 3.50 నుంచి 7.10 వరకు
    కెనరా : 4 నుంచి 7.25 వరకు
    కొటక్ మహేంద్రా : 2.75 నుంచి 7.20 వరకు
    యూనియన్ : 3 శాతం నుంచి 7 వరకు
    యస్ బ్యాంక్ : 3.25 నుంచి 7.50 వరకు
    బ్యాంక్ ఆఫ్ బరోడా : 3 నుంచి 7.25 వరకు

    సూచన : ఈ రేట్లు వారం నుంచి 10 సంవత్సరాల మధ్య కాలానికి సంబంధించింది. ఇప్పటి వరకు ఉన్న వడ్డీ రేట్లను మాత్రమే ఇక్కడ చెప్పడం జరిగింది.

    Share post:

    More like this
    Related

    Sunrisers Hyderabad : పంజాబ్ పై సన్ రైజర్స్ ఘన విజయం.. క్వాలిఫైయర్ 1 కు క్వాలిఫై

    Sunrisers Hyderabad : సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ ఎలెవన్...

    Medaram : 29, 30 తేదీల్లో వనదేవతల దర్శనం నిలిపివేత

    Medaram : మేడారంలోని వనదేవతలు సమ్మక్క, సారలమ్మ గద్దెల ప్రాంగణాన్ని ఈ...

    Cognizant : ఆఫీసుకు రాకుంటే జాబ్ నుంచి తీసేస్తాం: కాగ్నిజెంట్

    Cognizant : ఉద్యోగులంతా కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని, ఈ నిబంధనను...

    Arvind Kejriwal : ఆప్ అంతానికి బీజేపీ ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్

    Arvind Kejriwal : ఆప్ నేతలను అరెస్టు చేసి జైళ్లకు పంపించేందుకు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    March Deadline : మార్చి డెడ్ లైన్స్ మరిచిపోయారా? చివరి తేదీలు ఇవే..

    March Deadline : ఈ ఆర్థిక సంవత్సరం మార్చి నెలలో ముగుస్తుందనే...

    June 1st 2023 : జూన్ 1 నుంచి మారనున్న నిబంధనలు

    June 1st 2023 : జూన్ ఒకటి నుంచి కఠిన నిబంధనలు...