Belly Fat : ఇటీవల కాలంలో కొవ్వు పేరుకుపోతోంది. పొట్ట చుట్టు పేరుకుపోయే కొవ్వును బెల్లీ ఫ్యాట్ అంటారు. మన ఆహార అలవాట్లలో హెచ్చుతగ్గులు రావడంతో కొవ్వు మన ఒంట్లో పెరుగుతోంది. దీని వల్ల మనకు రోగాలు వస్తుంటాయి. కొవ్వు పెరగడం వల్ల మధుమేహం, రక్తపోటు వంటి వ్యాధులు దరి చేరతాయి. కొవ్వు వల్ల చాలా సమస్యలు ఏర్పడతాయి.
కొవ్వు పెంచే వాటిలో శీతల పానీయాలు ముఖ్యమైనవి. వీటికి దూరంగా ఉంటేనే మంచిది. బొజ్జ పెరగకుండా చేసే ఆహారాల్లో ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పాలు, పెరుగు, మజ్జిగ, చేపలు వంటి వాటిని తీసుకోవడం ఉత్తమం. ఇంకా పొట్టు తీయని ధాన్యాలు కూడా మంచి ఫలితాలు ఇస్తాయి. కొవ్వు వల్ల శరీర మెటబాలిజం దెబ్బతింటుంది. గుండె జబ్బులు, మధుమేహం, పక్షవాతం లాంటి సమస్యలు ఎక్కువవుతాయి.
తాజా మార్గదర్శకాల ప్రకారం మహిళల్లో 35 అంగుళాలు, మగవారిలో 31.5 అంగుళాల కన్నా చుట్టుకొలత పెరిగితే కొవ్వు పెరిగినట్లు భావించాలి. భారీకాయం కారణంగా నడుం చుట్టు కొలత పెరుగుతుంది. దీంతో మనకు అనేక రకాల వ్యాధులు పొంచి ఉంటాయి. ఇంకా అల్జీమర్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇన్సులిన్ సామర్థ్యం కూడా తగ్గుతుంది. దీంత కూడా సమస్యలు వస్తాయి.
వ్యాయామం చేయడం వల్ల బరువు తగ్గకపోయినా లోపల కొవ్వు మాత్రం కరుగుతుంది. కండరాలు బలం పుంజుకుంటాయి. రోజుకు ఓ అరగంట నడక, పరుగు, సైకిల్ తొక్కడం వంటివి చేయడం వల్ల మంచి ఫలితాలుంటాయి. శారీరక శ్రమ లేనివారు, ముసలివారు, జబ్బులతో బాధపడుతున్నా వారు వైద్యుల సలహా మేరకు వ్యాయామాలు చేయడం మంచిది.