Meera Suicide Letter : తమిళ హీరో విజయ్ ఆంటోనీ కుమార్తె మీరా రెండు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. మీరా విజయ్ ఆంటోనీకి పెద్ద కూతురు. 2007లోపుట్టిన ఆమెకు ఇప్పుడు 16 ఏళ్ల వయసు ఉంది. డాక్టర్ కావాలని ఆమె కలలు కన్నది. అందుకోసం ఆమె 12వ తరగతి చదువుతోంది. చదువుల్లో మీరా టాపర్ గా ఉండేది. రీసెంట్ గానే ఆమె కల్చరల్ సెక్రటరీగా ఎన్నికైంది. అయితే ఆమె కొంత కాలంగా ఒత్తిడికి గురయినట్టు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే ఆమె సెప్టెంబర్ 19న తన రూమ్ లోనే సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకుని చనిపోయింది. దాంతో విజయ్ కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. కాగా పోస్టు మార్టంలో ఆమెది సూసైడ్ అని డాక్టర్లు తేల్చారు. ఈ క్రమంలోనే మీరా సూసైడ్ లెటర్ ను కూడా పోలీసులు కనుగొన్నారు. ఇందులో లవ్ యు ఆల్.. మిస్ యు ఆల్ అని కోట్ తో రాసి ఉంది.
అంటే ఆమె అందరితో ఎలా కలిసిపోతుందో.. వారిని ఎంత మిస్ అవుతుందో దీన్ని బట్టి అర్థం అవుతోంది. కాగా మీరా అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య కీల్పాక్కం శ్మశాన వాటికలో జరిగాయి. ఇక్కడకు వచ్చిన అనేక మంది, సినీ రాజకీయ ప్రముఖులు ఆమెకు నివాళి అర్పించారు. మంత్రి ఉదయనిధి స్టాలిన్ తరలి వచ్చారు.
ఆయనతో పాటు ప్రభుదేవా, దేవి శ్రీ ప్రసాద్, హీరోలు కార్తి, సూర్య తదితరులు వచ్చి నివాళి అర్పించారు. ఇక మీరా ఫ్రెండ్స్ చాలామంది ఆమె చివరి చూపు కోసం తరలి వచ్చారు. అచేతన స్థితిలో పడిఉన్న ఆమెను చూసి కన్నీరు మున్నీరు అయ్యారు. ఇక విజయ్ ఫ్యామిలీకి సర్వత్రా సానుభూతి తెలుపుతున్నారు. ఆయన కొన్ని నెలల పాటు సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్నారు.