Vijay Antony Emotional : విలక్షణ నటుడిగా గుర్తింపు దక్కించుకున్న వారిలో ఒకరు విజయ్ ఆంటోని. సంగీత దర్శకుడిగా, నటుడిగా, డైరెక్టర్ గా, నిర్మాతగా వ్యవహరించారు. ఆయన కుమార్తె మీరా ఇంట్లో ఉరేసుకొని మరణించడంతో ఆయన కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. ఈ ఘటన దేశ వ్యాప్తంగా అన్ని ఇండస్ట్రీలలో తీవ్ర కలకలం రేపింది. దీంతో ఆయన కటుంబాన్ని ప్రముఖులు ఓదార్చారు. తన బిడ్డ మరణంపై విజయ్ ఆంటోనీ వాట్సప్ చాట్ అందరినీ కన్నీటి పర్యంతం చేసింది.
కూతురు మీరా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఆయన జీర్ణించుకోలేకపోయాడు. పోస్ట్ మార్టం తర్వాత అంత్యక్రియలు పూర్తయిన తర్వాత కూడా విషాదంలోకి వెళ్లారు. తన గారాలపట్టి మరణంతో గుండెలవిసేలా భావోద్వేగానికి లోనై లేఖ రాశారు. ఆయన వాట్సప్ చాట్ లో ఏముందంటే.?
నా కూతురు దయ, క్షమాగుణం, దైర్యవంతురాలు. కానీ ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందో తెలియదు.
కులం, డబ్బు, మతం, శత్రుత్వం, పేదరికం, బాధ, విద్వేషాలు లేని ప్రపంచానికి ఆమె తరలివెళ్లింది. ఇప్పుడు ఆమె ప్రశాంతంగా నిద్రపోతోంది అని రాసుకున్నాడు.
అనంత లోకాలకు వెళ్లిన మీరా రోజూ నాతో మాట్లాడుతుంది. ఆమెతో పాటు నేను కూడా చనిపోయినా కూతురుతో బతుకుతున్నాను. ఆమె నన్ను కొన్ని పనులు చేయమని ఆదేశించింది. ఆమె ఆదేశాలను నేను పాటిస్తాను. అంటూ విజయ్ ఆంటోని వాట్సప్ చాట్ లో పేర్కొన్నారు.
మీరా మరణంపై రూమర్లు
ఆంటోని కూతురు మీరా కొంత వివక్ష ఎదుర్కొందన్న విషయం బయటకు వచ్చింది. లావు, నలుపుగా ఉందన్న మాటలు ఆమెను తీవ్రంగా కలిచి వేశాయని మీడియాలో ప్రచారం జరుగుతుంది. మీరా మరణం వెనుక రూమర్లు, గాసిప్స్ ఉన్నాయి. వీటన్నింటినీ విజయ్ ఆంటోని ఖండిస్తున్నారు.
రంగంలోకి ఫొరెన్సిక్ టీమ్
ఆంటోని కూతురు మీరా ఫోన్ ను ఫోరెన్సిక్ అధికారులు సీజ్ చేశారు. చెన్నై పోలీసులు ఈ కేసును విచారిస్తున్నారు. మీరా ఫోన్‌లో ఎలాంటి ఛాటింగ్స్, ఫొటోలు ఉన్నాయి? ఎవరితో ఆమె క్లోజ్ గా ఉండేది? ఇలా వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఆమె ఆత్మహత్యకు సంబంధించి నిజాలు త్వరలోనే బయట పడతాయని చెప్తున్నారు.