Vijay Antony’s Daughter Viral Video :
విజయ్ ఆంటోనీ అంటే తెలియని ఇండియన్ ప్రేక్షకులు లేరు.. తమిళ్ హీరో అయినప్పటికీ తన సినిమాలతో ఈయన దేశం నలుమూలలా ఉన్న ఆడియెన్స్ ను మెప్పించాడు. ఈయన అంతలా తన పేరును అన్ని ఇండస్ట్రీలకు విస్తరింపజేసుకున్నారు.. నటుడిగా మాత్రమే కాదు ఇతడు నిర్మాతగా, మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా పేరు తెచ్చుకున్నాడు.
మరి ఈ స్టార్ హీరో కూతురు మీరా నిన్న ఉదయం ఆత్మహత్య చేసుకుని చనిపోవడం అందరిని షాక్ కు గురి చేస్తుంది. ప్రస్తుతం మీరా 12వ తరగతి చదువుతుంది.. ఇంత చిన్న వయసులో ఆత్మహత్య చేసుకుని చనిపోవడం విజయ్ ఆంటోనీకి ఆయన ఫ్యామిలీని తీవ్ర దుఃఖంలో ముంచేసింది.. ఈ కుటుంబం మాత్రమే కాదు ఆయన ఫ్యాన్స్ కూడా శోకసంద్రంలో మునిగి పోయారు.
12వ తరగతి చదువుతున్న మీరా నిన్న తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో చెన్నై లోని తమ నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈమె ఆత్మహత్య గురించి తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరి ఈమె చనిపోవడానికి ఒత్తిడే కారణం అయివుంటుందని భావిస్తున్నారు.
కూతురు మరణం గురించి ఇంత వరకు విజయ్ ఎలాంటి స్పందన ఇవ్వలేదు. ఈయన కృంగిపోవడంతో అభిమానులు, సినీ ప్రముఖులు దైర్యం చెబుతున్నారు. ఇక మీరా లాస్ట్ వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. చెన్నై చర్చ్ పార్క్ స్కూల్ లో చదువుతున్న మీరా కల్చరల్ యాక్టివిటీ సెక్రటరీగా నియమించిన సమయంలో ఎంతో కాన్ఫిడెంట్ గా దైర్యంగా స్టేజ్ మీదకు వెళ్తూ కనిపించింది. ఈ వీడియో విజయ్ ఫ్యాన్స్ నెట్టింట వైరల్ చేస్తున్నారు..
ReplyForward
|