No Entry For Media : విజయ్ ఆంటోనీ అంటే తెలియని ఇండియన్ ప్రేక్షకులు లేరు.. తమిళ్ హీరో అయినప్పటికీ తన సినిమాలతో ఈయన దేశం నలుమూలలా ఉన్న ఆడియెన్స్ ను మెప్పించాడు. నటుడిగా మాత్రమే కాదు ఇతడు నిర్మాతగా, మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా పేరు తెచ్చుకున్నాడు. మరి ఈ స్టార్ హీరో కూతురు మీరా సెప్టెంబర్ 19 తెల్లవారు జామున ఆత్మహత్య చేసుకుని చనిపోవడం అందరిని షాక్ కు గురి చేసింది.
ప్రస్తుతం మీరా 12వ తరగతి చదువుతుంది.. ఇంత చిన్న వయసులో ఆత్మహత్య చేసుకుని చనిపోవడం విజయ్ ఆంటోనీకి ఆయన ఫ్యామిలీని తీవ్ర దుఃఖంలో ముంచేసింది.. ఈ కుటుంబం మాత్రమే కాదు ఆయన ఫ్యాన్స్ కూడా శోకసంద్రంలో మునిగి పోయారు. కోలీవుడ్ మొత్తం ఇప్పుడు ఈ విషాదంలో మునిగిపోయి ఉంది.. అంతకంటే ముందు మరిముత్తు కూడా చనిపోయి ఇండస్ట్రీలో పెద్ద విషాదం చోటు చేసుకుంది.
వీరంతా బాధలో ఉంటె కొంత మంది యూట్యూబ్ ఛానెల్స్ వారు మీడియా వారు వివాదాలకు దారి తీసే కార్యకలాపాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కోలీవుడ్ మీడియా తాజాగా ఒక సంచలన నిర్ణయం తీసుకుంది.. కోలీవుడ్ లో ఏ ప్రముఖులు మృతి చెందిన కూడా వారి ఘటనల్లో మీడియాను అనుమతించ కూడదు అనే సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.
విజయ్ ఆంటోనీ కూతురు మృతి పట్ల కోలీవుడ్ ప్రముఖులు అంతా నివాళుల అర్పించారు.. అదే సమయంలో కోలీవుడ్ మీడియా ఛానెల్స్ వారితో పాటు కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ సిబ్బంది వ్యవహరించిన తీరు చర్చకు దారి తీసింది. చివరిసారిగా మీరాను చూసేందుకు వచ్చిన వారితో ఇంటర్వ్యూలు అంటూ ఎగబడి తప్పుడు థంబ్ నైల్స్ పెట్టి రచ్చ చేసింది. ఈ నేపథ్యంలో కోలీవుడ్ ఈ నిర్ణయం తీసుకుంది.