Kajal Aggarwal : హీరోయిన్ గా కాజల్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. సౌత్ ఇండస్ట్రీలో దశాబ్ద కాలానికి పైగా ఆమె అగ్ర హీరోయిన్ గా ఓ ఊపు ఊపేసింది. కేవలం తెలుగులోనే కాకుండా అటు తమిళంలో కూడా దాదాపు అందరు స్టార్ హీరోలతో ఆడిపాడింది ఈ ముద్దుగుమ్మ. పైగా తన కెరీర్ మొత్తంలో ఎలాంటి వివాదాలకు పోకుండా క్లీన్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది.
ఇంత సక్సెస్ ఫుల్ కెరీర్ ను సాగిస్తున్న సమయంలోనే పెళ్లి చేసుకుని ఓ కొడుకును కూడా కనేసింది. ఇప్పుడు కొడుకు పుట్టాక మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసేసింది. యంగ్ హీరోలు ఛాన్సులు ఇవ్వట్లేదు కాబట్టి సీనియర్ హీరోల సరసన నటిస్తోంది. ఇప్పుడు తమిళంలో కమల్ హాసన్ సరసన ఇండియన్-2లో నటిస్తోంది. దాంతో పాటు బాలీవుడ్ లో ఓ సినిమా చేస్తుందని సమాచారం.
ఈ క్రమంలోనే ఆమె ముంబైలో ఓ ఈవెంట్ కు హాజరయింది. అక్కడ ఆమెకు ఓ ప్రశ్న ఎదురైంది. మీరు డేటింగ్ కు వెళ్లాల్సి వస్తే ఏ హీరోతో వెళ్తారు అని యాంకర్ ప్రశ్నించింది. దానికి కాజల్ సమాధానం ఇస్తూ సీనియర్ హీరో నాగార్జునతో వెళ్తానని చెప్పింది. దాంతో అందరూ షాక్ అయిపోయారు. ఆయన కొడుకుతో కూడా నటించిన కాజల్.. అతనిపై మనసు పడటం ఏంటని అంతా ఆశ్చర్యపోతున్నారు.
ఇంతమంది యంగ్ హీరోలు ఉండగా.. నీకు ఆ వయసైపోయిన హీరో ఎలా నచ్చాడని కొందరు వల్గర్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇక్కడే ఓ లాజిక్ ఉంది. త్వరలోనే నాగార్జున ఓ సినిమా చేయబోతున్నాడు. ఇందులో హీరోయిన్ గా కాజల్ ను తీసుకుంటున్నారంట. అందుకే ఆమె నాగార్జునను పొగిడేందుకు ఇలాంటి కామెంట్స్ చేసిందని అంటున్నారు ఆమె అభిమానులు.