29.3 C
India
Tuesday, February 10, 2026
More

    Satyabhama Movie : కాజల్60 మూవీ పేరు ‘సత్యభామ’.. అదిరిపోయిన గ్లింప్స్..

    Date:

     

     

    Kajal Agarwal
    Kajal Agarwal

    Satyabhama Movie : తేజ డైరెక్షన్ లో వచ్చిన ‘లక్ష్మీ కళ్యాణం’లో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన కాజల్ అగర్వాల్ సుధీర్ఘ కాలం మంచి మంచి సనిమాలతో అలరిస్తూ వస్తోంది. ఇప్పటి వరకు ఆమె తెలుగులో 50 సినిమాలను పూర్తి చేసింది. వీటితో పాటు ఒక వెబ్ సిరీస్ లోనూ నటించారు. ఆ తర్వాత కొంత కాలం గ్యాప్ ఇచ్చారు. 2020, అక్టోబర్ 6వ తేదీన గౌతమ్ కిచ్లును వివాహం చేసుకున్న ఆమె 2022, ఏప్రిల్ 19న మగ శిశువుకు జన్మనిచ్చింది. ఇక మళ్లీ కమ్ బ్యాక్ ఇచ్చింది. తన 60వ చిత్రాన్ని ప్రకటించింది. దీనికి సంబంధించిన గ్లింప్స్ ఆమె బర్త్ డే సందర్భంగా సోమవారం (జూన్ 19వ తేదీ)న రిలీజ్ చేశారు.

    అందాల తార కాజల్ అగర్వాల్ మళ్లీ రెచ్చిపోయింది. #Kajal60 తన తదుపరి చిత్రంలో పవర్ఫుల్ పాత్రలో వెండితెరపై కనిపించబోతోంది. ఆమె బర్త్ డే సందర్భంగా అంటే జూన్ 19న ఓ గ్లింప్స్ ను విడుదల చేశారు మేకర్స్. మహిళా శక్తిని చాటిచెప్పే అంటే పోలీస్ కథతో తెరకెక్కిన ఈ చిత్రానికి అఖిల్ డేగల దర్శకత్వం వహించారు. ఉమెన్ సెంట్రిక్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కాజల్ మునుపెన్నడూ లేని విధంగా ప్రేక్షకులకు నచ్చే పాత్రలో కనిపించనుంది. బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కళ్లపల్లి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శశికిరణ్ తిక్క సమర్పణలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే కూడా అందిస్తున్నారు. శ్రీ చర ణ్ పాకాల ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.

    గింప్స్ లో ఏముంది..?
    పోలీస్ స్టేషన్ లో నిందితుడు అస్సలు నిజం చెప్పడం లేదు అన్న మాటతో గ్లింప్స్ ప్రారంభమవుతుంది. ఇక ఆమె కారు స్పీడ్ పెంచుతుంది. స్టేషణ్ కు చేరుకున్న ఆమె చేతిని దానికి ఉన్న గాజులు కనిపిస్తాయి. నిందితుడి నుంచి నిజం రాబట్టేందుకు పోలీస్ లాఠీ ఇస్తాడు. వద్దు అంటూ లాకప్ లోపలికి వెళ్లి అక్కడ ఖైదీని బాగా కొడుతుంది. వాడు నిజం చెప్తా అంటాడు. కట్ చేస్తే కింద రక్తం మరకలు కనిపిస్తాయి. గాజులు పగిలిపోయి కనిపిస్తాయి. ఇక లేడీ కానిస్టేబుల్ కాజులు లేకుండా కొట్టాల్సింది అంటే. మగ కానిస్టేబుల్ కొడితే చెప్పాడా అంటూ తన చేతిలో విరిగిపోయిన గాజును తీసేస్తుంది. అప్పుడే సిగను ముడుస్తూ ఆమె నడితే తీరు చేస్తే లేడీ ఓరియంటెడ్ మూవీగా అనిపిస్తుంది. ఖచ్చితంగా కాజల్ కు ‘సత్యభామ’ భారీ కంబ్యాక్ మూవీ అవుతుందని ఆమె ఫ్యాన్స్, సినీ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు.

    బ్యానర్ : ఔరం ఆర్ట్స్
    ప్రేరేపణలు : శశికిరణ్ తిక్క
    స్క్రీన్ ప్లే : శశికిరణ్ తిక్క
    సంగీతం : శ్రీ చరణ్ పాకాల
    పీఆర్వో : జీఎస్కే మీడియా
    దర్శకత్వం : అఖిల్ డేగల
    నిర్మాతలు: బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి

    https://www.youtube.com/watch?v=fdQBA2fgLJ8

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సైడ్ డ్యాన్సర్.. టాలీవుడ్ నే ఏలిందిగా.. ఏవరా బ్యూటీ

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సినిమాలో సైడ్...

    Kajal Aggarwal : ఆ 60 ఏళ్ల టాలీవుడ్ హీరోతో డేటింగ్ చేస్తా..  కాజల్ ఘాటు కోరికలు..!

    Kajal Aggarwal : హీరోయిన్ గా కాజల్ కు ఉన్న క్రేజ్...

    Kajal Aggarwal: పైట పక్కకు జరిపిన కాజల్.. ఎత్తైన పరువాలన్నీ చూపిస్తూ ఉడికిస్తోంది..!

    Kajal Aggarwal: చందమామ కాజల్ పెళ్లి తర్వాత కూడా అస్సలు తగ్గట్లేదు. తన...

    Kajal : మరోసారి గుడ్ న్యూస్ చెప్పిన కాజల్.. అందుకే సినిమాలకు గుడ్ బై చెప్పబోతుందా?

    Kajal : చందమామగా తెలుగు ప్రేక్షకులకు కాజల్ అగర్వాల్ బాగా సుపరిచితం.....