28.8 C
India
Tuesday, October 3, 2023
More

    ప్రధాని శ్రీ నరేంద్ర మోదీతో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ భేటీ.

    Date:

    CM Shri YS Jagan met Prime Minister Shri Narendra Modi
    CM Shri YS Jagan met Prime Minister Shri Narendra Modi

    – రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చ.

    – ప్రపంచవ్యాప్తంగా కోవిడ్‌ తాజా పరిణామాల నేపథ్యంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నామని ప్రధానికి వివరించిన సీఎం.

    – రాష్ట్ర విభజన జరిగి 8 ఏళ్లు సుదీర్ఘకాలం గడిచినప్పటికీ విభజన చట్టంలో పేర్కొన్న అంశాల్లో చాలావరకు ఇప్పటికీ నెరవేర్చలేదని, రెండు రాష్ట్రాల మధ్య ఇంకా చాలా అంశాలు అపరిష్కృతంగానే ఉన్నాయన్న సీఎం.
    – ఈ నేపథ్యంలో తాను చేసిన విజ్ఞప్తి మేరకు విభజన చట్టంలో అపరిష్కృతంగా ఉన్న అంశాలు, పార్లమెంటు వేదికగా రాష్ట్రానికి ఇచ్చిన హామీలు, రాష్ట్రానికి సంబంధించిన ఇతర హామీలపై కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ పలుమార్లు సమావేశం అయ్యిందని, కొంత పురోగతి సాధించినప్పటికీ, కీలక అంశాలు మాత్రం ఇప్పటికీ పరిష్కారం కాలేదని ప్రధానికి వివరించిన సీఎం.

    – 2014–15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రీసోర్స్‌ గ్యాప్‌ ఫండింగ్‌ కింద చెల్లించాల్సిన బకాయిలు అలానే ఉన్నాయన్న సీఎం. 2014–15 కు సంబంధించిన రూ.18,330.45కోట్ల బిల్లులు, 10వ వేతన సంఘం బకాయిలు, పెన్షన్లు మొదలైన వాటి రూపేణా మొత్తంగా రూ. 32,625.25 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని, వీటిని వెంటనే మంజూరు చేయాలని కోరిన సీఎం.

    – గత ప్రభుత్వం పరిమితికి మించి అధికంగా చేసిన రుణాలను, ఈ ప్రభుత్వంలో సర్దుబాటు చేస్తూ కేంద్ర ఆర్థిక శాఖ రుణాలపై పరిమితి విధిస్తోంది. కేటాయించిన రుణ పరిమితిలో కూడా కోతలు విధిస్తోంది. ఈ ప్రభుత్వం ఎలాంటి తప్పులు చేయనప్పటికీ గత ప్రభుత్వం చేసిన దానికి ఆంక్షలు విధిస్తోంది. కోవిడ్‌ లాంటి విపత్కర పరిస్థితుల్లో ఈ ఆంక్షలు రాష్ట్రాన్ని బాగా దెబ్బతీస్తాయి. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరిన సీఎం.

    – పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తన సొంత నిధులనుంచి ఖర్చు చేసిన రూ.2,937.92 కోట్ల రూపాయలను రెండేళ్లుగా చెల్లించలేదు. ఈ డబ్బును వెంటనే చెల్లించాల్సిందిగా విజ్ఞప్తిచేసిన సీఎం.
    – అలాగే పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం ఖరారు అంశంకూడా ఇంకా పెండింగులోనే ఉంది. మొత్తం ప్రాజెక్టుకోసం రూ.55,548 కోట్ల రూపాయలు అవుతుందని టెక్నికల్‌ అడ్వైజరీ కమిటీ ఇప్పటికే ఆమోదించిన విషయాన్ని ప్రధానమంత్రికి గుర్తుచేసిన సీఎం.
    – డ్రింకింగ్‌ వాటర్‌ సఫ్లైని ప్రాజెక్టు నుంచి వేరుచేసి చూస్తున్నారని, దీన్ని ప్రాజెక్టులో భాగంగా చూడాలని విజ్ఞప్తిచేసిన సీఎం. దేశంలో జాతీయ హోదా పొందిన ఏ ప్రాజెక్టులోనైనా డ్రింకింగ్‌ వాటర్‌ను ప్రాజెక్టులో భాగంగా చూశారన్న సీఎం.
    – పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని కాంపొనెంట్‌ వైజ్‌గా చూస్తున్నారని, బిల్లుల రీయింబర్స్‌మెంట్‌లో తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని, ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం కావడమే కాకుండా, వ్యయం కూడా పెరుగుతుందని ప్రధానికి వివరించిన సీఎం. ప్రాజెక్టు నిర్మాణ వ్యవయాన్ని కాంపొనెంట్‌ వైజ్‌గా చూడొద్దని, ఆ నిబంధనలను పూర్తిగా తొలగించాలని కోరిన సీఎం.
    – ప్రాజెక్టు నిర్వాసితులకు సహాయ పునరావాస ప్యాకేజీని డీబీటీ ద్వారా చెల్లించాలని కోరిన సీఎం. దీనివల్ల చాలావరకు సమయం ఆదా అవుతుందని తెలిపిన సీఎం. వీలైనంత త్వరగా ఈ కార్యక్రమాన్ని పూర్తిచేయాలని కోరిన సీఎం. ఆలస్యం అవుతున్నకొద్దీ ప్రాజెక్టు ఖర్చు పెరిగిపోతుందని పేర్కొన్న సీఎం.
    – పోలవరం ప్రాజెక్టునుంచి తక్షణమే ప్రయోజనాలను అందించడానికి ప్రాధాన్యతా క్రమంలో పనులు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామన్న సీఎం. దీంట్లో భాగంగా 41.15 మీటర్ల ఎత్తు వరకూ ఆయా కుటుంబాలను తరలించాల్సి ఉంటుందని, ఈమేరకు పనులు చేయడానికి దాదాపు రూ.10,485.38 కోట్లు అవసరం అవుతుందని, ఈ డబ్బును అడహాక్‌గా మంజూరు చేసినట్టైతే పనులు వేగంగా ముందుకు సాగుతాయని పీఎంకు వివరించిన సీఎం. ఈ డబ్బు మంజూరుచేసినట్టైతే భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్‌ పనులు సకాలంలో పూర్తిచేయడానికి అవకాశం ఉంటుందన్న సీఎం.

    – తెలంగాణ డిస్కంల నుంచి రావాల్సిన రూ.6,886 కోట్ల కరెంటు బకాయిలను వెంటనే ఇప్పించాల్సిందిగా ప్రధానిని కోరిన సీఎం. తీవ్ర కష్టాల్లో ఉన్న ఏపీజెన్‌కోకు ఈ బకాయిలు చాలా అవసరమని తెలిపిన సీఎం.

    – జాతీయ ఆహార భద్రతా చట్టంలో నిబంధనలు హేతుబద్ధంగా లేవని, దీనివల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లుతోందని ప్రధాని దృష్టికి తీసుకు వచ్చిన సీఎం. రాష్ట్ర ప్రభుత్వం వ్యక్తంచేసిన అంశాలతో నీతి ఆయోగ్‌ కూడా ఏకీభవించి కేంద్ర ప్రభుత్వానికి చేసిన సిఫార్సునూ ప్రస్తావించిన ముఖ్యమంత్రి. రాష్ట్రంలో అర్హత ఉన్న 56 లక్షల కుటుంబాలు పీఎంజీకేఏవై కింద లబ్ధి పొందడం లేదని, వీరికి రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా అందిస్తోందని, రూ.5,527 కోట్లను రాష్ట్ర ప్రభుత్వమే ఖర్చు చేసిందని ప్రధానికి వివరించిన సీఎం. నెలకు సుమారు 3 లక్షల టన్నులు రేషన్‌ బియ్యం కేంద్రం వద్ద మిగిలిపోతున్నాయని, ఇందులో 77వేల టన్నులు రాష్ట్రానికి కేటాయిస్తే అర్హులందరికీ ఆహార భద్రతా చట్టం వర్తింపు చేసినట్టువుతుందని పీఎంకు వివరించిన సీఎం. ఈమేరకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసిన సీఎం.

    – రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా కల్పనపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరిన ముఖ్యమంత్రి. విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా అవశ్యమని, పార్లమెంటు వేదికగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలని పునరుద్ఘాటించిన సీఎం.

    – రాష్ట్రాంలో జిల్లాల పునర్విభజన తర్వాత వాటి సంఖ్య 26కు చేరిందని, కేంద్రం కొత్తగా మంజూరుచేసిన 3 కాలేజీలతో కలుసుకుని ఇప్పటికి 14 మెడికల్‌ కాలేజీలు మాత్రమే ఉన్నాయని తెలిపిన సీఎం. పునర్విభజన తర్వాత ప్రతి జిల్లాలో సుమారుగా 18 లక్షల మంది జనాభా ఉన్నారని తెలిపిన సీఎం. మిగిలిన 12 జిల్లాలకు వెంటనే మెడికల్‌ కాలేజీలు మంజూరుచేయాలని పీఎంను కోరిన సీఎం. ఇప్పటికే క్షేత్రస్థాయిలో పనులు వేగంగా కొనసాగుతున్నాయని వివరించిన సీఎం.

    – కడపలో నిర్మించనున్న సీల్‌ప్లాంటుకు సరిపడా ఖనిజాన్ని అందుబాటులో ఉంచడానికి ఏపీఎండీసీకి గనులు కేటాయించాలని కోరిన సీఎం.

    – విశాఖలో 76.9 కిలోమీటర్ల మేర మెట్రో రైల్‌ ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే డీపీఆర్‌ను సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించామని, ఈ ప్రాజెక్టుకు కావాల్సిన సహాయ సహకారాలు అందించాల్సిందిగా కోరిన సీఎం.

    Share post:

    More like this
    Related

    Blue Whale : కోజికోడ్ తీరానికి కొట్టుకొచ్చిన చనిపోయిన తిమింగలం

    Blue Whale : చేపల్లో పెద్దది తిమింగలం. అది చిన్న చిన్న...

    Ramasethu PIL : ఆ విషయం మా పరిధి కాదు.. ‘రామసేతు’ పిల్ ను తోసిపుచ్చిన సుప్రీం కోర్టు..

    Ramasethu PIL : ‘రామసేతు’ను జాతీయ స్మారక చిహ్నంగా ప్రకటించి, ఆ...

    Minister Roja Emotional : బండారు సత్యనారాయణ వ్యాఖ్యలపై మంత్రి రోజా భావోద్వేగం

    Minister Roja Emotional : మాజీ మంత్రి బండారు సత్యనారాయణ వ్యాఖ్యలపై...

    Lokesh CID Inquiry : లోకేష్‌ సీఐడీ విచారణ ఈ నెల 10కి వాయిదా

    Lokesh CID Inquiry : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా...

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Chandrababu Arrest : చంద్రబాబు అరెస్ట్ వెనుక బీజేపీ.. బలపడుతున్న అనుమానాలు..?

    Chandrababu Arrest : రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును...

    PM Modi Telangana Visit : నేడు తెలంగాణకు మోదీ.. ఆ రెండు పార్టీలపై అటాక్..

    PM Modi Telangana Visit : నేడు తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు....

    CM Jagan Meeting : ఏపీలో సీఎం జగన్ కీలక సమావేశం.. ఎమ్మెల్యేలకు నో ఎంట్రీ..

    CM Jagan Meeting : ఏపీలో సీఎం జగన్ ఎన్నికల వ్యూహాలు సిద్ధం...

    Jagan Image : ఎన్టీఆర్, వైఎస్ఆర్, బాబుకు ఉన్న ఇమేజ్ జగన్ కు ఉందా?

    Jagan Image : గెలుపు ఓటములు ఎప్పుడూ శాశ్వతం కావు. ఒక...