కెనడా వెళ్లి ఉన్నత చదువులు చదవాలని అనుకునేవాళ్లకు ఆ దేశం వీసాలు మంజూరు చేయకుండా షాక్ ల మీద షాక్ లు ఇస్తోంది. కోవిడ్ కంటే ముందు కెనడా వీసాలు కావాలని అప్లయ్ చేసుకునే వాళ్లలో 15 నుండి 20 శాతం మాత్రం రిజెక్ట్ అయ్యేవి. మిగతావాళ్లకు వీసాలు మంజూరు అయ్యేవి. కానీ కోవిడ్ ఉదృతి తర్వాత మాత్రం వీసాలను ఇవ్వకుండా కెనడా ప్రభుత్వం షాక్ ఇస్తోంది….. ముఖ్యంగా భారతీయులకు.
కోవిడ్ కు ముందు 15 నుండి 20 శాతం మాత్రమే రిజెక్ట్ అయ్యేవి. కానీ ఇటీవల కాలంలో ఏకంగా 50 శాతం వీసాలను రిజెక్ట్ చేస్తోంది కెనడా ప్రభుత్వం. అయితే వీసాలను ఎందుకు నిరాకరిస్తున్నారో వివరణ కూడా ఇవ్వడం లేదు దాంతో కెనడా వీసాల కోసం అప్లయ్ చేసుకున్న వాళ్లలో తీవ్ర నిరాశ నిస్పృహలు తలెత్తుతున్నాయి. అయితే వీసాల కోసం దరఖాస్తు చేసుకునే వాళ్ళు ఎక్కువగా ఉండటంతో ఈ పరిస్థితి తలెత్తవచ్చు అని భావిస్తున్నారు పరిశీలకులు.