38.7 C
India
Saturday, May 18, 2024
More

    Dussehra Celebrations: ‘కొలంబస్ తెలంగాణ అసోసియేషన్’ ఆధ్వర్యంలో ‘దసరా’ సంబురాలు.. ఎప్పుడంటే?

    Date:

    Dussehra Celebrations: భారతదేశం యావత్తు ఆనందంగా, వైభవంగా జరుపుకునే పండుగ దసరా. దసరా వస్తుందంటే చాలు ఇటు రైతుల నుంచి అటు పారిశ్రామిక వేత్తల వరకు ఆనందంలో మునిగిపోతారు. అసలు పండుగ ఒక్కరోజే అయినా.. ముందు వెనుకా.. వేడుకలు సంబురాలతో ఎంజాయ్ చేస్తారు. పండుగకు ముందు రైతులు పాడి పంటలకు పూజలు చేయడం.. గల్లీ ఆఫీస్ నుంచి కార్పొరేట్ ఆఫీస్ వరకు తమ కార్యాలయాలను వేడుకలకు ముస్తాబు చేయడం ప్రతీ ఏటా కనిపిస్తూనే ఉంటుంది.

    ఇక పండుగ రోజు కార్యక్రమాలు మరింత ఆనందాన్ని ఇస్తాయి. యావత్ భారత్ ఈ వేడుకలను కన్నుల పండువగా, అత్యంత వైభవంగా నిర్వహించుకుంటుంది. ఇది ఒక ఇండియాలోనే కాదు.. ఇతర దేశాల్లో సెటిల్ అయిన ఇండియన్స్ కూడా అక్కడ ఆనందంగా నిర్వహించుకుంటారు. తమకు దొరికిన వస్తువులతో పండుగను తోచిన కాడికి చేసుకుంటారు. ఇక అమెరికలో అయితే ఈ కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతుంటాయి.

    ‘కొలంబస్ తెలంగాణ అసోసియేషన్’ ఆధ్వర్యంలో ‘దసరా ధూమ్ దాం’ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం కనీ వినీ ఎరుగని విధంగా చేయాలని నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. అక్టోబర్ 29, 2023 రోజున గ్రోవ్‌పోర్ట్ మ్యాడిషన్ హైస్కూల్, 4475 S హామిల్టన్ రోడ్, గ్రోవ్‌పోర్ట్, ఓహియో (OH) 43125లో మధ్యాహ్నం 1 గంట రాత్రి 7 గంటల వరకు కొనసాగుతుంది.

    ఇందులో సంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. టాలీవుడ్ లెజెండ్స్ (డ్యాన్స్ స్కిట్), కలియుగ కృష్ణుడు (సోసియే ఫాంటసీ స్కిట్), లోకల్ టాలెంట్, కిర్రాక్ సాంగ్స్, వెండర్ బోత్స్ లాంటివి ఏర్పాటు చేయనున్నారు.

    మరిన్ని వివరాలకు రమేశ్ మధు, ప్రెసిడెంట్-(714)271-2655, సాయి, అల్లాడి-(615) 275-6414, గోజయ్-(601)447-2503, సురేశ్-(850) 491-0918లో సంప్రదించాలని నిర్వాహకులు తెలిపారు.

    Share post:

    More like this
    Related

    Kanipakam Temple : కాణిపాకం ఆలయంలో పెరిగిన భక్తుల రద్దీ

    - సర్వ దర్శనానికి 5 గంటల సమయం వేసవి సెలవుల్లో తిరుమలతో పాటు...

    Bharatiyadu 2 : ‘భారతీయుడు 2’లోనే ‘భారతీయుడు 3’ ట్రైలర్ కట్.. సేనాపతి భారీ స్కెచ్ మామూలుగా లేదుగా..

    Bharatiyadu 2 : ‘భారతీయుడు 2’ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి...

    Young Tiger NTR : ఆ భూమి విషయంలో కోర్టుకెక్కిన యంగ్ టైగర్.. చివరికి ఏమైందంటే?

    Young Tiger : ఓ భూవివాదంలో ఉపశమనం కోరుతూ జూనియర్ ఎన్టీఆర్...

    Hardik Pandya : హార్దిక్ పాండ్యాపై మ్యాచ్ నిషేధం.. ఎందుకో తెలుసా?

    Hardik Pandya : ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా IPL...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Bathukamma Dussehra : పూల సింగిడి.. దసరా సందడి.. ప్రపంచవ్యాప్తంగా వేడుకలు..!

    Bathukamma Dussehra : విజయదశమి పండుగను దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా...