Canada : విదేశాల్లో చట్టాలు కఠినంగా ఉంటాయి. భారత్ లో చేసినట్టు చేద్దామంటే కుదరదు. కెనడాలో ఇలాగే చట్టాల ఉల్లంఘించిన భారతీయుడికి 5 ఏళ్ల జైలు శిక్ష పడింది. కెనడాలో నివసిస్తున్న 40 ఏళ్ల భారతీయ జాతీయుడు అనేక మంది భారతీయ పౌరులను కెనడా నుండి అమెరికాకు లాభాపేక్ష కోసం అక్రమంగా తరలించినందుకు కాను అరెస్ట్ అయ్యి జైలుపాలయ్యాడు. విచారణలో తన నేరాన్ని అంగీకరించాడు.
సిమ్రంజిత్ ‘షల్లీ’ సింగ్ (40)కు శుక్రవారం న్యూయార్క్‌లోని అల్బానీలలోని యూఎస్ డిస్ట్రిక్ కోర్టు ఐదేళ్ల జైలు శిక్షతోపాటు 250000 డాలర్ల జరిమానా విధించింది. షల్లీ సింగ్ మొదట ఆరుగురిని, ఆ తర్వాత ముగ్గురిని కెనడా నుంచి అమెరికాకు అక్రమ రవాణా చేసినట్టు తేల్చారు. విచారణలో నేరాన్ని అంగీరించారు.
అమెరికా ప్రభుత్వ అభ్యర్థన మేరకు షల్లీ సింగ్‌ను జూన్ 28, 2022న కెనడాలోని అంటారియోలో అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఏడాది మార్చి 30న అతన్ని కెనడా నుంచి అమెరికాకు రప్పించినట్లు న్యూయార్క్‌లోని నార్తర్న్ డిస్ట్రిక్ట్‌లోని యుఎస్ అటార్నీ కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది.
2020 మార్చి నుండి 2021 మార్చి వరకు, సెయింట్ లారెన్స్ నది ప్రాంతంలోని కార్న్‌వాల్ ద్వీపం , అక్వేసాస్నే మోహాక్ ఇండియన్ రిజర్వేషన్ ద్వారా కెనడా నుండి యుఎస్‌లోకి అనేక మంది భారతీయ పౌరులను స్మగ్లింగ్ చేసినట్లు షెల్లీ సింగ్ అంగీకరించాడు.
తిరిగి మార్చిలో నలుగురు భారతీయ , నలుగురు రొమేనియన్ వలసదారుల మృతదేహాలను ఆక్వేసాస్నేలోని సెయింట్ లారెన్స్ నది నుండి స్వాధీనం చేసుకున్నారు. మాంట్రియల్‌కు పశ్చిమాన 120 కిలోమీటర్ల దూరంలో మరియు అక్రమ రవాణాకు ప్రమాదకరమైన మార్గం అని.. ఆ మార్గం గుండా షెల్లీ సింగ్ తరలించి వారి చావుకు కారణమయ్యారని అధికారులు తెలిపారు. కోర్టు అతడికి 5 ఏళ్ల జైలు శిక్ష విధించింది.