30.1 C
India
Thursday, May 16, 2024
More

    Jagan : జగన్ అప్పులు.. రాష్ర్టం దివాళా.. రఘురామ పంచులు

    Date:

    jagan-ragurama
    jagan-ragurama

    Jagan ఏపీలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ర్టానికి అప్పులు పెరిగిపోయాయని విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. సంక్షేమ పథకాలకు బటన్ నొక్కుడు పేరిట ఆయన అప్పులు తెచ్చి రాష్ర్టాన్ని  దివాళా స్థితికి తీసుకెళ్తున్నారని ప్రతిపక్షాలు మండిపడుతుంటాయి. రాష్ర్టంలో సంపద సృష్టి లేదని, పరిశ్రమల రాక మొత్తం మొదలైందని, ఏపీని మరో శ్రీలంక చేస్తున్నారని మండిపడుతున్నాయి. ఏపీ అప్పులపై కేంద్రం కూడా గతంలో పలుమార్లు హెచ్చరించింది. అయితే ఈ సొమ్మంతా వైసీపీ నేతల జేబుల్లోకి వెళ్తుందని ఆరోపణలు వినిపిస్తుంటాయి.

    తాజాగా జైస్వరాజ్య్ టీవీలో నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు మాట్లాడుతూ ఏపీని జగన్ దివాళా స్థితికి తెచ్చాడని మండిపడ్డారు. గతంలో కంటే ఎక్కువ పథకాలు ఏం లేవని కానీ అప్పలు ఇంతలా ఎందుకు అయ్యాయో తెలియడం లేదని చెప్పుకొచ్చారు. ఈ బటన్ నొక్కడం ఏంటో తనకు అర్థం కాలేదని వ్యంగ్యంగా మాట్లాడారు. జగన్ పథకాలతో ఇప్పటివరకు లాభపడ్డదెవరో కూడా తెలియట్లేదని చెప్పారు. రాష్ర్టంలో ఏవర్గం కూడా సంతోషంగా లేరని, రానున్న ఎన్నికల్లో వైసీపీకి గుణపాఠం చెప్పేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. అయితే ఏపీ సీఎం జగన్ పై రఘురామ తరచూ ఇలాంటి కామెంట్లు చేస్తూనే ఉంటారు.  జగన్ వల్లే ఈ పరిస్థితి వచ్చిందని, ఒక్క చాన్స్ అంటూ ప్రజలకు అప్పుల కుప్ప పెట్టారని మండిపడ్డారు.

    ఏపీలో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. సంక్షేమ పథకాల అమలుకు ప్రభుత్వం తెస్తున్న అప్పులు ఇప్పుడు ప్రమాదకరస్థాయికి చేరుకున్నాయి. బటన్ నొక్కుతున్నా అంటూ పథకాలు అమలు చేస్తున్నా, అభివృద్ధి విషయంలో ఇదే శ్రద్ధ పెడితే బాగుండని వాదనలు వినిపిస్తున్నాయి. ఏపీలో ప్రస్తుతం రోడ్ల పరిస్థితి అధ్వానంగా మారాయి. కేవలం సంక్షేమ పథకాలకే ఉన్న నిధులన్నీ సరిపోతున్నాయి. ఉద్యోగ నోటిఫికేషన్లు లేవు. అభివృద్ధి పనులు పడకేశాయి. పోలవరం పనులు నత్తనడకన నడుస్తున్నాయి. ఇలాంటి సందర్భంగా రఘురామ విమర్శలు కరక్టేనని అంతా చర్చించుకుంటున్నారు.

    Share post:

    More like this
    Related

    Sr. NTR : ఎన్టీఆర్ చరితం చిరస్మరణీయం..

    Sr. NTR : ఎన్టీఆర్ తెలుగు ఆత్మగౌరవాన్ని దేశవ్యాప్తంగా చాటిన మహనీయుడు....

    Indian 2 : ‘భారతీయుడు2’ రిలీజ్ డేట్ ఫిక్స్?

    Indian 2 : విశ్వనటుడు కమల్ హాసన్, ప్రముఖ దర్శకుడు శంకర్...

    Palnadu News : బస్సులో మంటలు.. ఆరుగురి సజీవ దహనం..

    Palnadu News : పల్నాడులో బుధవారం తెల్లవారు జామున ఓ ప్రైవేటు...

    Pushpa 2 : ఫాస్ట్ ట్రాక్ మోడ్ లో పుష్ప!

    Pushpa 2 : ఈ మధ్య కాలంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Jagan : జగన్ సైలెంట్ మోడ్ లోకి ఎందుకు వెళ్లినట్లు..?

    Jagan Silence : ఆంధ్రప్రదేశ్ లో నిన్న (మే 13) పోలింగ్...

    Jagan : అనుకున్నది ఒకటి.. అయ్యింది మరొకటి..!

    Jagan : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి...

    Amaravati Movement : 1600వ రోజుకు చేరిన అమరావతి ఉద్యమం

    Amaravati Movement : అమరావతి ఉద్యమం 1600వ రోజుకు చేరుకున్న సందర్భంగా...

    Alliance : కాపులు కలిసి వస్తారా..! కూటమి ఏమనుకుంటుంది?

    Alliance : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కుల కోణాన్ని పరిశీలిస్తే రెడ్డి సామాజికవర్గం...