21 C
India
Sunday, September 15, 2024
More

    కేసీఆర్ కు లేఖ రాసిన బండి సంజయ్

    Date:

    Bandi Sanjay wrote a letter to KCR
    Bandi Sanjay wrote a letter to KCR

    గౌరవనీయులైన శ్రీ కె.చంద్రశేఖరరావు గారికి,

    తెలంగాణ ముఖ్యమంత్రి,

    ప్రగతి భవన్, హైదరాబాద్.

    నమస్కారం….

     విషయం : తెలంగాణ పోలీసు నియామకాలకు సంబంధించి దేహదారుఢ్య పరీక్షల్లోని లోపాలు, అవకతవకలను వెంటన సవరించాలని కోరుతూ వినతి.

    రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి నిర్వహించిన దేహధారుడ్య పరీక్షలను నోటిఫికేషన్ లో పేర్కొన్న దానికి భిన్నంగా నిర్వహించినట్లు అభ్యర్థుల నుండి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. లాంగ్ జంప్, షార్ట్ పుట్ పరీక్షల్లో నోటిఫికేషన్ లో చెప్పిన దానికి భిన్నంగా అధికారులు వ్యవహరించడంవల్ల దాదాపు 2 లక్షల మంది పురుష, మహిళా అభ్యర్థులు అర్హత సాధించలేకపోయినట్లు మా ద్రుష్టికి వచ్చింది. అర్హుల ఎంపికలోనూ అవకతవకలు జరిగినట్లు కూడా ఫిర్యాదులు వస్తున్నాయి. 

    తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పోలీసు ఉద్యోగాల నియమాక ప్రక్రియ మొదటి నుండి వివాదాలకు తావిచ్చేలా వ్యవహరిస్తుండటం దురద్రుష్టకరం. ప్రిలిమినరీ పరీక్షల్లో కటాఫ్ మార్కుల విషయంలోనూ అభ్యర్థులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసినా ప్రభుత్వం పట్టించకోకపోవడం బాధాకరం. తాజాగా దేహదారుఢ్య పరీక్షల్లోనూ నోటిఫికేషన్ కు భిన్నంగా కొత్త నిబంధనలు పెట్టి అభ్యర్థులను డిస్ క్వాలిఫై చేయడం అన్యాయం. 

    దేశంలోని అనేక రాష్ట్రాల్లోనూ లాంగ్ జంప్ డిస్టన్స్ 3.8 మీటర్లుగానే ఉంది. మన రాష్ట్రంలో మాత్రం 4 మీటర్లుగా నిర్ణయించడంవల్ల అభ్యర్థులకు పెద్ద ఎత్తున అన్యాయం జరిగింది. లాంగ్ జంప్ తోపాటు షాట్ పుట్ విషయంలో పాత విధానాన్ని అమలు చేయాలి. లాంగ్ జంప్ లో ఆన్ ది లైన్ ను కూడా పరిగణలోకి తీసుకోవాలి. అట్లాగే ఎస్ఐ, కానిస్టేబుల్ పరీక్షల్లో తప్పుగా ఇచ్చిన ప్రశ్నలకుగాను అభ్యర్థులందరికీ మార్కులు కలపాలని కోరుతున్నాం. తక్షణమే జరిగిన తప్పిదాలను సరిదిద్ది లక్షలాది మంది అభ్యర్థులకు తగిన న్యాయం చేయాలని కోరుతున్నాం. 

    భారత మాతాకీ జై…..

    బండి సంజయ్ కుమార్, ఎంపి

    అధ్యక్షులు, బీజేపీ తెలంగాణ శాఖ. 

    Share post:

    More like this
    Related

    Naveen Polishetty : బడా ప్రొడ్యూసర్ తో నవీన్ పొలిశెట్టి టై అప్

    Naveen Polishetty : నవీన్ పొలిశెట్టి జాతిరత్నాలు సినిమాతో తెలుగులో హీరోగా...

    Tollywood : బడ్జెట్ కంట్రోల్ ఎలా.. వరుస ప్లాఫులతో నిర్మాతలు ఉక్కిరిబిక్కిరి

    Tollywood: తెలుగు సినిమా ఇండస్ట్రీకి  ప్లాఫుల కొత్తమీ కాదు. ఏడాదికి దాదాపు...

    Hero Govindha : మంత్రి కుమార్తె ఆ స్టార్ హీరో ఇంట్లో పనిమనిషి.. విషయం తెలియగానే ఏం చేశారంటే

    Hero Govindha : హీరోలు, హీరోయిన్లు అంటే చాలా మంది అభిమానం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    KCR : ప్రతిపక్షంలోనూ కేసీఆర్ ‘దొర’ పెత్తనమే..

    KCR : తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ తీరు విచిత్రంగా, అప్రజాస్వామికంగా...

    KCR : సార్లంతా ఫుల్ బిజీ.. ‘కారు’ స్టీరింగ్ పట్టేవారేరి?

    KCR  : ఒక ఉద్యమ నేతగా, తెలంగాణ రాష్ట్ర సాధన కర్తగా...

    Chandrababu : కేసీఆర్ కు ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడే కావాలా?

    Chandrababu : ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం నుంచి బీఆర్ఎస్ (అప్పుడు టీఆర్ఎస్)...