36.9 C
India
Tuesday, April 21, 2026
More

    జూపల్లి , పొంగులేటిని సస్పెండ్ చేసిన BRS

    Date:

    Jupalli and ponguleti suspend from BRS
    Jupalli and ponguleti suspend from BRS

    భారత్ రాష్ట్ర సమితి ఎట్టకేలకు తీవ్ర నిర్ణయం తీసుకుంది. ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డిని , మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావును BRS నుండి సస్పెండ్ చేసింది. గతకొంత కాలంగా ఈ ఇద్దరూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది భారత్ రాష్ట్ర సమితి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి చాలాకాలంగా కేసీఆర్ , కేటీఆర్ వ్యవహార శైలి పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నాడు. ఇటీవల కాలంలో ఖమ్మం జిల్లాలో ఆత్మీయ సమ్మేళనం పేరిట పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. ఆ కార్యక్రమాల పట్ల గులాబీ శ్రేణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

    ఇక మహబూబ్ నగర్ జిల్లా లోని కొల్లాపూర్ అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసి మంత్రిగా కూడా పనిచేశాడు జూపల్లి కృష్ణారావు. అయితే 2018 లో జరిగిన ఎన్నికల్లో జూపల్లి ఓడిపోయాడు. ఇక అప్పటి నుండి జూపల్లి కృష్ణారావును దూరం పెట్టింది అధిష్టానం. దాంతో అప్పటి నుండి జూపల్లి అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నాడు. ఇక నిన్న ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కాగా ఆ వేడుకలో అటు జూపల్లి ఇటు పొంగులేటి ఇద్దరు కూడా కేసీఆర్ మీద తీవ్ర అవినీతి ఆరోపణలు చేశారు. దాంతో ఇక ఉపేక్షించి లాభం లేదని ఈరోజు ఇద్దరిని కూడా సస్పెండ్ చేసింది భారత్ రాష్ట్ర సమితి.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Sakalamma : మాజీ సీఎం కేసీఆర్ ఇంట్లో విషాదం

    కేసీఆర్ సోదరి సకలమ్మ కన్నుమూత Sakalamma : తెలంగాణ మాజీ...

    Supreme Court : ఓటుకు నోటు కేసులో బీఆర్ఎస్ పార్టీకి షాక్.. పిటీషన్ ను కొట్టివేసిన సుప్రీంకోర్టు

    Supreme Court : ఓటుకు నోటు కేసులో బీఆర్ఎస్ పార్టీకి షాక్...

    High Court : బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ను కూల్చండి.. హైకోర్టు కీల‌క ఆదేశాలు

    High Court Order : భారత రాష్ట్ర సమితికి సంబంధించి పార్టీ...

    KCR : సార్లంతా ఫుల్ బిజీ.. ‘కారు’ స్టీరింగ్ పట్టేవారేరి?

    KCR  : ఒక ఉద్యమ నేతగా, తెలంగాణ రాష్ట్ర సాధన కర్తగా...