గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ని మళ్ళీ అరెస్ట్ చేసారు. మూడు రోజుల కింద రాజాసింగ్ ని అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరచగా నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అంతేకాదు రాజాసింగ్ ని అరెస్ట్ చేయడం తప్పని పేర్కొంది. కట్ చేస్తే ఈరోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత రాజాసింగ్ ఇంటికి చేరుకున్న పోలీసులు అరెస్ట్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. హైదరాబాద్ మహానగరంలో రాజాసింగ్ వల్ల శాంతిభద్రతలకు ప్రమాదం పొంచి ఉందన్న సాకుతో రాజాసింగ్ ని పోలీసులు అరెస్ట్ చేసారు. ఈ అరెస్ట్ పై భారతీయ జనతా పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి.
Breaking News