37 C
India
Friday, May 17, 2024
More

    భగవంత్ కేసరి టీజర్.. మరోసారి బాలయ్య సింహగర్జన.. గూస్ బంప్స్ తెప్పించాడుగా!

    Date:

    నటసింహం నందమూరి బాలకృష్ణ ఈ రోజు పుట్టిన రోజు జరుపు కుంటున్నారు. అందుకే ఆన్ లైన్ ఆఫ్ లైన్ అనే తేడా లేకుండా బాలయ్య జన్మదిన వేడుకలు మిన్నంటాయి.. ఫ్యాన్స్ బాలయ్య బాబు పుట్టిన రోజు నాడు తెగ సందడి చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈయన పుట్టిన రోజు నాడు ఫ్యాన్స్ కు ఆయన నటిస్తున్న కొత్త సినిమా నుండి అదిరిపోయే ట్రీట్ వచ్చేసింది.
    ఇప్పటికే రెండు రోజులు ముందుగానే బాలయ్య సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ చేయగా అదిరిపోయే రెస్పాన్స్ అందుకోగా ఈ రోజు ఈ సినిమా నుండి టీజర్ రిలీజ్ చేసి అసలైన బర్త్ డే ట్రీట్ ఇచ్చారు.. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ చేస్తున్న సినిమాకు ”భగవంత్ కేసరి” అనే టైటిల్ ను ఫిక్స్ చేసి మొన్న మాసివ్ లెవల్లో రిలీజ్ చేసారు.
    ఇక ఈ రోజు కొద్దిసేపటి క్రితం టీజర్ ను రిలీజ్ చేయగా నెక్స్ట్ లెవల్లో ఉంది.. బాలయ్య సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో డైలాగ్స్ తెలంగాణ యాసలో చెప్పిన డైలాగ్స్ కు గూస్ బంప్స్ వచ్చాయి.. ”రాజు ఆయన ఎనకాల ఉన్న వందల మంది మందను చూయిస్తడు.. మొండోడు ఆనికున్న ఒకే ఒక్క గుండెను చూయిస్తడు” అంటూ చెప్పిన డైలాగ్ అదిరింది.
    అలాగే హిందీలో కూడా బాలయ్య ఒక డైలాగ్ చెప్పారు. ఇది కూడా బాగా ఆకట్టుకుంది. థమన్ ముందు నుండి చెప్పినట్టుగానే అఖండ, వీరసింహారెడ్డి సినిమాలకు మించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చి మోత మోగించాడు.. మొత్తంగా బాలయ్య అభిమానులు కోరుకునే మాస్ స్టఫ్ ఈ సినిమా టీజర్ లోనే చేయించాడు. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలంటే దసరా వరకు ఆగాల్సిందే..

    Share post:

    More like this
    Related

    AP Attacks : కేంద్ర నిఘా వర్గాల హెచ్చరిక..ఆ పార్టీ ఓడిపోతుందనే ప్రచారంతోనే దాడులు..

    AP Attacks : ఏపీలో ఎన్నికలు పూర్తయ్యే వరకు సుద్దపూసల్లాగా నీతులు...

    Vijayashanthi-KCR : రాముల‌మ్మకు కేసీఆర్ గుర్తుకు వస్తున్నారా.. ఆ ట్వీట్ అర్థం ఏంటో?

    Vijayashanthi-KCR : బీఆర్ఎస్‌ పార్టీపై సినీ నటి, రాజకీయ నాయకురాలు  విజయశాంతి...

    Kidnap : కిడ్నాప్ చేసి.. 26 ఏళ్లు పొరుగింట్లోనే బంధించారు

    Kidnap : చంకలో బిడ్డనుంచుకొని ఊరంతా వెతికినట్లు పక్కింట్లో వ్యక్తిని పెట్టుకొని...

    Prabhas : కాబోయే భార్యను పరిచయం చేయబోతున్న ప్రభాస్.. ఇన్ స్టా పోస్టు వైరల్ 

    Prabhas : డార్లింగ్స్ ఫైనల్లీ సమ్ వన్ వెరీ స్పెషల్ పర్సన్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Kesari Festival Daawat : కేసరి చిచ్చా పండుగ దావత్ (#KCPD).. ఫుల్ ఎంటర్‌టైనర్

    Kesari Festival Daawat : అనిల్ రావిపూడి-నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ లో...

    Chiranjeevi Balakrishna : బాలకృష్ణ కంటే చిరు మార్కెట్ ఎక్కువ! ఎందుకో తెలుసా?

    Chiranjeevi Balakrishna : 80's నుంచి ప్రజెంట్ యంగ్ జనరేషన్ వరకు...

    Ravi Teja vs Balaiah : రవితేజ వర్సెస్ బాలయ్య లాజిక్ రిపీట్ అవుతుందా.. ?

    Ravi Teja vs Balaiah : ఈసారి కూడా దసరా బరిలో...