34 C
India
Tuesday, May 21, 2024
More

    Telangana KTR : రూ. 7 కోట్ల నుంచి రూ. 41 కోట్లకు కేటీఆర్ ఆదాయం ఇలా పెరిగిందట..

    Date:

    Telangana KTR : తెలంగాణ రాష్ర్ట ఐటీ మంత్రిగా, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కల్వకుంట్ల తారక రామారావు తనదైన ప్రత్యేకత సాధించారు. రాష్ర్టాన్ని ఐటీలో టాప్ లో నిలిపేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారు. రాష్ర్టానికి కాబోయే ముఖ్యమంత్రిగా ప్రస్తుతం ఆయన పేరే వినిపిస్తున్నది. ఇదే స్థాయిలో ఆయన ప్రజల అభిమానాన్ని పొందుతూనే, పనితీరును కూడా చూపిస్తున్నారు. దేశంలోనే ఐటీ, పారిశ్రామిక రంగం మీద మంచి పట్టున్న నేతగా ఆయన పేరు సంపాదించారు. తెలంగాణకు ప్రస్తుతం వివిధ పరిశ్రమలు క్యూ కడుతున్నాయంటే అది కేటీఆర్ వల్లేనని అంతా చెబుతారు.

    అయితే తాజాగా ఆయనకు ఓ సాఫ్ట్వేర్ వ్యక్తి నుంచి ప్రశ్న ఎదురైంది. టీవీ స్టూడియోలో ఇంటర్వ్యూలో ఉన్న మంత్రి కేటీఆర్ కు సదరు వ్యక్తి ఘాటైన ప్రశ్న వేశారు. దీనికి అదే స్థాయిలో కేటీఆర్ బదులు చెప్పారు. ఇంతకీ అది ఏంటంటే.. రూ. 7 కోట్ల ఆస్తులు ఉన్నట్లు గతంలో అఫిడవిట్ సమర్పించిన కేటీఆర్.. ఆ తర్వాత రూ. 41 కోట్ల ఆస్తులు ఉన్నట్లు సమర్పించారని పేర్కొన్నారు. ఇంత పెద్ద మొత్తం ఎలా సంపాదించారని, తనకు కూడా చెబితే ఉద్యోగం రిజైన్ చేసి ట్రై చేస్తానని చెప్పారు. దీంతో కేటీఆర్ కూడా అదే స్థాయిలో బదులిచ్చారు. తనది సాఫ్ట్ వేర్ జాబ్ కాదని.. హార్డ్ వేర్ అని చెప్పుకొచ్చారు. దీంతో పాటు తన అప్పులు 27 కోట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. 2004లోనే అమెరికాలో రూ. 4 లక్షల వేతనానికి పని చేసినట్లు గుర్తు చేశారు.  గోడలకు సున్నాలు వేసుకున్న వ్యక్తి జూబ్లీహిల్స్ లో ఉండి, 12 ప్లాట్లు కొనుక్కున్నారని, బెంజ్ కారులో తిరుగుతున్నారని పరోక్షంగా ఓ పార్టీ నేతను ఉద్దేశించి వ్యాఖ్యనించారు.

    అయితే మంత్రి కేటీఆర్ ఆస్తులపై విపక్షాలు కూడా పలుమార్లు విమర్శలకు దిగుతుంటాయి. కల్వకుంట్ల ఫ్యామిలీ లక్షల కోట్లు సంపాదించిందని ఆరోపణలు చేస్తుంటాయి. దీనికి కూడా ఆయన పలుమార్లు కౌంటర్లు ఇచ్చారు. పెద్ద ఎత్తున వ్యాపారాలు, ఫామ్ హౌస్లు, విల్లాలు, కేసీఆర్ ఫ్యామిలీకి ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కూడా కవిత పేరు బయటకు వచ్చింది. ఇలా ఒకనాటి ఉద్యమ కుటుంబంపై ఇలాంటి ఆరోపణలు రావడం తరచూ వస్తున్నదే. అయితే వీటన్నింటికీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత ఎప్పటికప్పుడు తమదైన శైలిలో కౌంటర్లు ఇస్తూనే ఉంటారు.

    Share post:

    More like this
    Related

    Road Accident : ఛత్తీస్ గఢ్ లో రోడ్డు ప్రమాదం – వాహనం లోయలో పడి 18 మంది మృతి

    Road Accident : ఛత్తీస్ గఢ్ లో ఘోర రోడ్డు ప్రమాదం...

    Prashant Kishore : వైసీపీకి ఘోర పరాజయం: ప్రశాంత్ కిషోర్

    Prashant Kishore : ఏపీలో టీడీపీదే గెలుపని ప్రముఖ రాజకీయ వ్యూహకర్త...

    AP Voilence : ఏపీలో హింసాత్మక ఘటనలపై.. డీజీపీకి సిట్ నివేదిక

    AP Voilence : ఏపీలో ఎన్నికల పోలింగ్ రోజు, ఆ తర్వాత...

    Manchu Lakshmi : పొట్టి బట్టల్లో చెలరేగిపోతున్న మంచు లక్ష్మి

    Manchu Lakshmi : తెలుగులో మంచు లక్ష్మి అంటే తెలియని వారు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    BRS : వద్దన్నా వినలేదు..అందుకే రావట్లేదు

    BRS : వరంగల్, నల్లగొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం వాస్తవానికి ...

    KTR : రాష్ట్ర ప్రజలకు కేటీఆర్ సూచన.. ఇవి దగ్గరపెట్టుకోండి

    KTR : తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కేటీఆర్ ట్విటర్ (ఎక్స్) ద్వారా...

    KTR Message : బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ సందేశం

    KTR Message : బీఆర్ఎస్ 24వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు....

    KCR Family : రెండు దశాబ్దాల తర్వాత ఎన్నికలకు దూరంగా కేసీఆర్ కుటుంబం..

    KCR Family : రెండు దశాబ్దాల తర్వాత తొలిసారిగా తెలంగాణ మాజీ...