NTR Devara Movie : కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన సినిమా దేవర. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. చిరంజీవి హీరోగా ఆచార్య తీసిన శివ అది ప్లాప్ కావడంతో తన తదుపరి సినిమా అలా ఉండొద్దనే ఉద్దేశంతో జాగ్రత్తలు తీసుకున్నట్లు చెబుతున్నారు. ఆచార్య ఇచ్చిన షాక్ తో శివ దేవర సినిమాను తనదైన శైలిలో తెరకెక్కించినట్లు సమాచారం.
రాగ మేకర్స్ పతాకంపై నిర్మించిన దేవర ప్రేక్షకుల అంచనాలు అందుకోబోతోంది. సినిమాపై లేటెస్ట్ అప్ డేట్స్ కూడా ఇచ్చారు. సినిమాలో ఓ భారీ షెడ్యూల్ ప్రస్తుతం నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్, బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ లపై కొన్ని యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించారు. సినిమా హాలీవుడ్ లెవల్లో ఉంటుందని అంచనా. చిత్రంలో భారీ బడ్జెట్ తో కూడిన ససన్నివేశాలు ఉంటాయని చెబుతున్నారు.
ఇప్పుడు దేవర సినిమాపై ప్రేక్షకుల అంచనాలు భారీగానే ఉన్నాయి. జనతా గ్యారేజ్ వీరి కాంబినేషన్ లో వచ్చి హిట్ సాధించిన సంగతి తెలిసిందే. మళ్లీ అలాంటి హిట్ కొట్టాలని దర్శకుడు తాపత్రయపడుతున్నాడు. సినిమాకు సంగీతం అనిరుద్ అందిస్తున్నాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ వారు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
మళ్లీ కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబినేషన్ అదరహో అనిపించుకోవాలని చూస్తోంది. వీరి కాంబినేసన్ కు మంచి గుర్తింపు దక్కాలని ఆశపడుతున్నారు. ఇప్పటికే షూటింగ్ చాలా భాగం పూర్తిచేసుకుంది. దీనిపై ఎప్పటికప్పుడు అప్ డేట్స్ కూడా విడుదల చేస్తున్నారు. ఎన్టీఆర్ కెరీర్ లో మరో మంచి మూవీ కావాలని ఆశిస్తున్నారు.
ReplyForward
|