ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్ అమెరికాలో జరుగుతున్న ఆటా వేడుకలలో పాల్గొన్నారు. అమెరికాలోని వాషింగ్టన్ డీసీ లో ఆటా ( అమెరికా తెలుగు సంఘం ) 17 వ మహాసభలు అంగరంగ వైభవంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ వేడుకలలో పాల్గొనడానికి పెద్ద ఎత్తున సినీ రంగ ప్రముఖులు , రాజకీయ ప్రముఖులు , వ్యాపారవేత్తలు పాల్గొన్నారు.
ఇక ఈ వేడుకల కోసం అమెరికా వెళ్లిన చంద్రబోస్ అక్కడ ఆటా వేడుకలలో పాల్గొన్నారు. ఆటా ప్రతినిధులు సమకూర్చిన వసతులతో సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు చంద్రబోస్. తెలుగువాళ్లు అందరూ ఇలా ఒక చోటకు చేరడం , అన్ని రకాల సమస్యలను ప్రస్తావించుకోవడం అలాగే చేయాల్సిన మంచి పనులను చర్చించుకోవడం చాలా సంతోషకర పరిణామమని కొనియాడారు చంద్రబోస్.