మెగాస్టార్ చిరంజీవిని చరణ్ ఏడిపించాడట. ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవి వెల్లడించడం గమనార్హం. తండ్రి మెగాస్టార్ చిరంజీవి అంటే చరణ్ కు ఎనలేని గౌరవం , భక్తి కూడా. అలాంటిది చిరంజీవిని ఏడిపించడం ఏంటి ? అని అనుకుంటున్నారా ? ఏడిపించడం అంటే …… బాధపెట్టి ఏడిపించడం కాదు సుమా ! సంతోషకంగా ఏడిపించడం అన్నమాట. బాగా సంతోష పడినా, అలాగే బాధపడినా కన్నీళ్లే వస్తాయి ……. కాకపోతే బాధపడితే వచ్చే కన్నీళ్లు ఏడుపు కాగా సంతోషకరమైన సమయంలో వచ్చేవి ఆనంద భాష్పాలు. అలా చిరంజీవి సంతోషంతో ఏడ్చాడట.
అసలు ఎందుకు చిరుకు ఆనంద భాష్పాలు వచ్చాయో తెలుసా ……. తమ వారసుడు చరణ్ కోడలు ఉపాసన తల్లిదండ్రులు కావాలని , మనవడు లేక మనవరాలుని ఇస్తారని చాలాకాలంగా ఎదురు చూస్తున్నారు చిరంజీవి – సురేఖ దంపతులు. చరణ్ – ఉపాసనలు పెళ్లి చేసుకొని పదేళ్లు అయినప్పటికీ ……. అతడి కంటే ముందు తర్వాత పెళ్లి చేసుకున్న హీరోలు తల్లిదండ్రులు కావడంతో చరణ్ కూడా తండ్రి అయితే అలాగే వారసులను ఇస్తే వాళ్లతో ఆడుకోవాలని ముచ్చట పడ్డారట.
కానీ వీళ్ళు అడగడమే తప్ప వాళ్ళు ఆ కోరిక తీర్చిందే లేదు దాంతో ఇక అడిగి ప్రయోజనం లేదని మిన్నకుండిపోయారట. సరిగ్గా అలాంటి సమయంలో ఒకరోజు చరణ్ – ఉపాసన వచ్చి మేము ఓ బిడ్డకు జన్మనివ్వబోతున్నాం …… మీరు తాత – నానమ్మ కాబోతున్నారు అని చెప్పేసరికి ఒక్కసారిగా కన్నీళ్లు వచ్చాయట చిరంజీవికి అలాగే సురేఖకు కూడా. ఇక ఇది నిజమే అని పూర్తిగా నిర్దారించుకున్న తర్వాత మాత్రమే అధికారికంగా ప్రకటించామని సంతోషంగా చెబుతున్నాడు. అదన్న మాట అసలు సంగతి.