డార్లింగ్ ప్రభాస్ ఎపిసోడ్ తో ఆహా ఓటీటీ యాప్ క్రాష్ అయ్యింది. దాంతో అందరూ ఇబ్బంది పడ్డారు. ఈ స్థాయిలో ప్రభాస్ అభిమానులు ఒక్కసారిగా అభిమానం చూపిస్తారని తెలియని ఆహా సిబ్బంది ఎట్టకేలకు టెక్నికల్ ప్రాబ్లం సాల్వ్ చేసారు. ఊహించని స్థాయిలో డార్లింగ్ ఫ్యాన్స్ ఒక్కసారిగా ఆహా మీద పడటంతో ఈ పరిస్థితి తలెత్తింది. మొత్తానికి బాహుబలి ఎపిసోడ్ అన్నందుకు ఆ స్థాయిలోనే స్పందన వచ్చిందని చాలా చాలా సంతోషంగా ఉంది ఆహా టీమ్.
ఇక ప్రభాస్ ఎపిసోడ్ కు ఈ స్థాయిలో విరుచుకుపడితే ….. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ దద్దరిల్లి పోవాల్సిందే. ఆ విషయం పక్కన పెడితే అన్ స్టాపబుల్ షోతో బాలయ్య సరికొత్త సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. మొదటి సీజన్ బ్లాక్ బస్టర్ కావడంతో రెండో సీజన్ స్టార్ట్ చేసారు. ఇక ఈ రెండో సీజన్ కూడా అదిరిపోయే రెస్పాన్స్ అందుకుంటోంది. బాహుబలి ఎపిసోడ్ తో మరోసారి రికార్డుల మోత మోగుతోంది.
బాలయ్య ప్రశ్నలు ప్రభాస్ సమాధానాలు అభిమానులను , ఓటీటీ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నాయి దాంతో రికార్డులు కట్టబెడుతున్నారు. ఈ ఎపిసోడ్ బ్లాక్ బస్టర్ కావడంతో ఆహా టీమ్ చాలా సంతోషంగా ఉన్నారు. బాలయ్య తో అన్ స్టాపబుల్ షో చేస్తే సక్సెస్ అవుతుందని అనుకున్నారు. కానీ దేశంలోనే నెంబర్ వన్ షోగా నిలుస్తుందని ఊహించలేదు. బాలయ్య – ప్రభాస్ ఇంటర్వ్యూను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. మొదటి ఎపిసోడ్ నిన్న రాత్రి స్ట్రీమింగ్ కాగా మరో ఎపిసోడ్ కూడా రానుంది.