నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న షో ” అన్ స్టాపబుల్ విత్ NBK ”. ఆహా కోసం చేస్తున్న ఈ షో బ్లాక్ బస్టర్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఈ షోకు బాహుబలి ప్రభాస్ వచ్చిన విషయం తెలిసిందే. ఇటీవలే అన్ స్టాపబుల్ 2 షోలో ప్రభాస్ , గోపీచంద్ ఇద్దరు కూడా బాలయ్య షోలో పాల్గొన్నారు. తాజాగా బాహుబలి ప్రభాస్ కు సంబందించిన ప్రోమో విడుదల కాగా ఆ ప్రోమోకు అనూహ్య స్పందన వచ్చింది.
తాజాగా ఆహా టీమ్ బాహుబలి ప్రభాస్ ప్రోమోకు వచ్చిన స్పందనను లెక్కలతో సహా ప్రకటించింది. బాలయ్య – ప్రభాస్ ప్రోమోకు 1.4 మిలియన్లకు పైగా లైక్ లు రాగా 1.3 కోట్లకు పైగా డిజిటల్ వ్యూస్ లభించాయి. అలాగే #PrabhasOnAha అనే హ్యాష్ ట్యాగ్ కు లక్షకు పైగా ట్వీట్ లు వచ్చాయి. ఇక ఇప్పటికి కూడా ఈ బాహుబలి ప్రోమో యూట్యూబ్ లో నెంబర్ వన్ గా ఉంది.
అంటే బాలయ్య షోలో ప్రభాస్ ఏం చెప్పబోతున్నాడు ……. ఆ ఎపిసోడ్ ఎలా ఉండబోతోంది అనే ఉత్సుకత అభిమానుల్లో నెలకొంది. దాంతో ఈ ప్రోమోను ఇంతగా స్పందన వస్తోంది. ప్రోమోకు ఇంతగా స్పందన లభించడంతో ఇక డిసెంబర్ 30 న స్ట్రీమింగ్ అయ్యే బాలయ్య – బాహుబలి ప్రభాస్ ఎపిసోడ్ రికార్డుల మోత మోగించడం ఖాయం. ఈ ఎపిసోడ్ కోసం మరో 10 రోజులు ఎదురు చూడాల్సిందే. డిసెంబర్ 30 న ఆహా లో స్ట్రీమింగ్ కానుంది. మొత్తానికి బాలయ్య షోకు మరో రికార్డ్ జత కాబోతోంది డార్లింగ్ ప్రభాస్ ఎపిసోడ్ తో.