NTR టాలీవుడ్ లో ఒక్కో స్టార్ హీరో క్రేజీ ప్రాజెక్టులను సెట్ చేసుకుని వారి లైనప్ లో వరుసగా సినిమాలను చేర్చుకుంటూ పోతున్నారు. మరి టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఎన్టీఆర్ ఒకరు.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు గ్లోబల్ వైడ్ గా ఫేమస్ అయ్యాడు. ఆర్ఆర్ఆర్ వంటి సినిమాతో తన స్టార్ డమ్ ను విస్తరించుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు క్రేజీ ప్రాజెక్టులు లైన్లో పెట్టుకున్నాడు.
తారక్ నెక్స్ట్ తన 30వ సినిమాను కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్నాడు. ”దేవర” అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా నుండి ఎప్పుడు ఏదొక వార్త నెట్టింట వైరల్ అవుతూనే ఉంది. ‘దేవర’ సినిమాతో కొరటాల ఎన్టీఆర్ ను వీర మాస్ లెవల్ లో చూపించడానికి సిద్ధం అయ్యాడు. ఎన్టీఆర్ కూడా వరుస హిట్స్ తో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు.
ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతగానో ఎగ్జైట్ గా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో తారక్ డ్యూయెల్ రోల్ చేస్తున్నట్టు టాక్.. ఈ మూవీకు సంబంధించిన స్టోరీ తాజాగా లీక్ అయ్యింది.. ఇది ఒక రియల్ లైఫ్ స్టోరీ ఆధారంగా తెరకెక్కుతోందని టాక్.. 1985 ప్రాంతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో దారుమైన హత్యాకాండను హైలెట్ చేస్తూ కొరటాల కథ రాసారంట..
బాపట్ల సమీపంలోని కారం చెడు ప్రదేశంలో జరిగిన ఈ యదార్ధ సంఘటనతో ఈ సినిమా తెరకెక్కుతోందని దళితులను క్రూరంగా అగ్రవర్ణం ఎలా ఊచకోత కోశారు దీని వల్ల ఎంత మంది దళితులూ నిరాశ్రయులు అయ్యారు అనే అంశంతో కొరటాల కథ రాసుకున్నారట.. ఇదే నిజమైతే ఈసారి ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయం.. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జోడీగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా సైఫ్ అలీ ఖాన్ విలన్ రోల్ పోషిస్తున్నాడు.