రెండు దశాబ్దాల తర్వాత మళ్ళీ మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తున్నాను అంటూ పోస్ట్ చేసాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. యుక్త వయసు వచ్చినప్పటి నుండే పవన్ కళ్యాణ్ కరాటే నేర్చుకున్నాడు. చిన్నప్పటి నుండి సమాజంలో కనిపిస్తున్న గుండాలను, రౌడీలను చూసి తట్టుకోలేకపోయేవాడట ! ఆవేశంతో ఊగిపోయేవాడట. అయితే అప్పట్లో శక్తి సరిపోలేదు కాబట్టి మార్షల్ ఆర్ట్స్ మీద మనసు పెట్టాడు.
హీరోగా పరిచయమైన కాలంలో కూడా మార్షల్ ఆర్ట్స్ రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేసేవాడు. అంతకుముందు కళ్యాణ్ బాబు గా పేరుండేది. మార్షల్ ఆర్ట్స్ లో ప్రావీణ్యం సంపాదించిన తర్వాత మాత్రమే కళ్యాణ్ బాబు కాస్త ” పవన్ కళ్యాణ్ ” గా మారింది. ఇక అప్పటి నుండి వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండాపోయింది.
ఇక ఇప్పటి మార్షల్ ఆర్ట్స్ విషయానికి వస్తే …… 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎందుకు ప్రాక్టీస్ చేస్తున్నాడంటే ……. పవన్ కళ్యాణ్ పై రాజకీయంగా దారుణమైన విమర్శలు చేస్తున్నారు వైసీపీ శ్రేణులు. అలాగే తనపై దాడులకు కూడా పాల్పడే అవకాశం ఉన్నందున తనని తాను రక్షించుకోవడానికి ఇలాంటి మార్షల్ ఆర్ట్స్ తప్పకుండా ఉపయోగపడుతుందని భావిస్తున్నాడు. అందుకే మళ్ళీ మార్షల్ ఆర్ట్స్ శిక్షణ ప్రారంభించాడు. అలాగే హరిహర వీరమల్లు చిత్రంలో పోరాట సన్నివేశాలు చాలానే ఉన్నాయి. వాటికోసం కూడా ఇలా శిక్షణ పొందుతున్నాడని భావించవచ్చు.